- Telugu News Photo Gallery Cinema photos Tamil Actress Divya Bharathi Instagram Photos Goes Viral On Social Media
Tollywood: ఏంటీ.! ఈ అమ్మడు ఆమేనా.? అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్
పైన పేర్కొన్న ఫోటోలోని హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా.? ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఒకప్పుడు బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కున్న ఈ అమ్మడు ఇప్పుడు కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్ గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి.
Updated on: Aug 06, 2025 | 1:52 PM

ఈ అమ్మడు కెరీర్ తొలినాళ్లలో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంది. అంతేకాకుండా ఎన్నో అవమానాలు ఎదుర్కుని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకుంది. మరి ఆమె ఎవరో మీకు గుర్తొచ్చిందా.? ఈ బ్యూటీ మరెవరో కాదు తమిళ క్రేజీ హీరోయిన్ దివ్య భారతి.

కాలేజీ రోజుల్లో అమాయకంగా కనిపిస్తూ.. డీగ్లామరస్‌గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు కుర్రాళ్లకు గ్లామర్ డాల్. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చేసింది మూడు సినిమాలే.. కట్ చేస్తే.. కుర్రాళ్లకు ఆరాధ్య దేవతగా మారింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ పెంచుకుంది. పాత్ర ఏదైనా కూడా దానికి ప్రాణం పోసి మరీ నటించింది. ‘బ్యాచిలర్’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు.

మొదటి చిత్రంలోనే హీరో జీవి ప్రకాష్‌తో బోల్డ్ సీన్స్, లిప్‌లాక్‌లతో రెచ్చిపోయింది. అలాగే ఆ సినిమాలో సుబ్బలక్ష్మీ పాత్రకు ప్రాణం పోసి.. తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఆ హీరోతోనే 'కింగ్‌స్టన్' చిత్రంలో నటించింది.

1992వ సంవత్సరం, జనవరి 28న కోయంబత్తూరులో పుట్టింది దివ్యభారతి. ‘బ్యాచిలర్’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల భామ.. ఆ తర్వాత ‘జర్నీ’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఇప్పుడు ఈ అమ్మాడి ఖాతాలో ఏకంగా మూడు, నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి.

సుడిగాలి సుధీర్ హీరోగా తెరకెక్కుతున్న ‘G.O.A.T -Greatest Of All Time’ అనే చిత్రంతో దివ్యభారతి హీరోయిన్‌గా తెలుగు తెరపైకి అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్ ఇప్పటికీ చాట్‌బస్టర్‌గా మారింది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కిన ‘మహారాజా’ మూవీలో దివ్యభారతి స్పెషల్ రోల్ చేసింది.




