సలార్ మీద కూడా అలాంటి కామెంట్సే వచ్చాయి. అందుకే ఇద్దరూ తమ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను నెగెటివ్ కామెంట్స్‌కు స్కోప్ ఇవ్వకుండా ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత తక్కువ రన్‌టైమ్‌తో నెక్ట్స్ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు.
దేవర సినిమాకు నార్త్ లో ఎలాంటి రిసెప్షన్ ఉంటుందని ఆసక్తిగా గమనించిన వారందరూ ఇప్పుడు ఫుల్ ఖుషీ. నార్త్ జనాలు యమాగా ఆదరిస్తున్నారు దేవరను. తారక్ పెర్ఫార్మెన్స్, జాన్వీ అప్పియరెన్స్, సైఫ్ విలనిజం.. ప్రతిదీ వారిని ఆకట్టుకుంటున్నాయి.
ది బెస్ట్ పెర్ఫార్మర్‌నే వార్2 కోసం సెలక్ట్ చేసుకున్నారనే కాన్ఫిడెన్స్ గట్టిగానే కనిపిస్తోంది నార్త్ జనాల్లో. 2025లో వార్2 లో హృతిక్, తారక్ ఎలా పోటీపడతారో చూడటానికి వెయిట్ చేస్తున్నారు.
నార్త్ లో విలన్‌గా తారక్ స్ట్రాంగ్ అవుతున్న ఈ టైమ్‌లోనే సౌత్ నుంచి మరో హీరో పేరు అక్కడ విలన్‌గా వినిపిస్తోంది. ధూమ్ 4లో రణ్‌బీర్ కపూర్‌కి విలన్‌గా సూర్యని అనుకుంటున్నారు. నవంబర్‌లో కంగువతో మెప్పించడానికి రెడీ అవుతున్నారు సూర్య.
విలనిజం సూర్యకి కొత్తేం కాదు. ఆయన సినిమాల్లోనే కాదు, పొరుగు సినిమాల్లోనూ చేసి మెప్పించారు. ఆ మధ్య ఆయన చేసిన రోలెక్స్ కేరక్టర్‌ని జనాలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. అందుకే నార్త్ లో రణ్‌బీర్‌కి సూర్య విలన్ అవుతారనే వార్త ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది.