Commercial Cinema: క్యారెక్టర్స్ చూసారా ఎంత రఫ్‎గా ఉన్నాయో.! కమర్షియల్ అర్థం మారిందా.?

Updated on: Feb 08, 2025 | 9:17 AM

కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోతుందా లేదంటే మన హీరోలే కమర్షియల్ సినిమా అనే పదానికి అర్థం మార్చేస్తున్నారా..? ఒకప్పుడు చొక్కా నలక్కుండా 100 మందిని ఎగరేసి కొట్టినోళ్లే.. ఇప్పుడు ఒక్కో పాత్ర కోసం అలా నలిగిపోవడానికి కారణమేంటి..? మార్పు మొదలైందా లేదంటే మారకపోతే కష్టమని మన హీరోలే మారిపోతున్నారా..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

1 / 5
టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాకు అర్థం మారిపోతుంది. అర్థం పర్థం లేని కథల కంటే.. పర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలపైనే ఫోకస్ చేస్తున్నారు మన హీరోలు. అలాంటి కథలకే తమ నటనతో కమర్షియల్ స్టామినా తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొన్నేళ్లుగా మన హీరోలు మాస్ రగ్డ్ కారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్నారు. రంగస్థలం నుంచి ఈ ట్రెండ్ మొదలైంది.

2 / 5
రామ్ చరణ్ లాంటి మాస్ హీరోతో రంగస్థలం లాంటి సినిమా సుకుమార్ అనౌన్స్ చేసినపుడు షాక్ అయ్యారంతా. కానీ సినిమా విడుదలయ్యాక.. తన పర్ఫార్మెన్స్‌తో అందరినీ షాక్ అయ్యేలా చేసాడు సిట్టిబాబు. సినిమా వచ్చి ఆరేళ్లు దాటినా.. ఇప్పటికీ ఆ ఇంపాక్ట్ తగ్గలేదు.

3 / 5
ఆ తర్వాత పుష్ప కోసం అల్లు అర్జున్‌ను అలాగే మార్చేసారు లెక్కల మాస్టారు. పుష్పతో బన్నీకి ఏకంగా నేషనల్ అవార్డే వచ్చింది. తాజాగా పుష్ప 2లోనూ అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా కొన్ని సీన్స్ అయితే పూనకాలు పుట్టించారు. జాతర సీక్వెన్స్, క్లైమాక్స్‌లో బన్నీ పర్ఫార్మెన్స్‌కు నార్త్ ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. దసరాతో నాని ఇదే మ్యాజిక్ చేసారు.

4 / 5
దేవరలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సినిమా బ్లాక్‌బస్టర్ అయిందంటే కారణం తారక్ నటనే. ఇక వార్ 2లో కూడా మాస్ పాత్రలో కనిపిస్తున్నారు తారక్. ఇక ప్రశాంత్ నీల్‎తో సినిమా అంటే ఎలా ఉండుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

5 / 5
ఇక ఫలితంతో పనిలేకుండా గేమ్ ఛేంజర్‌లోని అప్పన్న పాత్రతో రామ్ చరణ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. తాజాగా శ్రీకాంత్ ఓదెలతో చిరు ఇలాంటి మాస్ సినిమానే అనౌన్స్ చేసారు. హీరో ఎవరైనా.. కమర్షియల్‌గా ఉంటూనే నటనలోనూ కుమ్మేస్తున్నారు. మొత్తానికి ఈ మార్పు మంచికే అంటున్నారు ఆడియన్స్.