- Telugu News Photo Gallery Cinema photos Know This Bigg Boss Beauty Cum Heroine Earns rs 4 Lakhs From Instagram, She is Dharsha Gupta
Bigg Boss : గ్లామర్ ఫోటోషూట్లతో నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. ఎలాగంటే.
సోషల్ మీడియాలో సినీతారలు , సీరియల్ సెలబ్రెటీలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూనే ఉంటారు. సినిమా అప్డేట్స్, పర్సనల్ లైఫ్ విషయాలను నెట్టింట అభిమానులతో పంచుకుంటారు. కానీ ఓ బిగ్ బాస్ బ్యూటీ మాత్రం ఫోటోషూట్లతో నెలకు రూ.4 లక్షలు సంపాదిస్తుందట. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో తెలుసా..
Updated on: Aug 26, 2025 | 8:39 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో సినీతారలు చేసే హడావిడి గురించి చెప్పక్కర్లేదు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు హీరోయిన్స్. అయితే ఇప్పుడు ఓ బిగ్ బాస్ బ్యూటీ కమ్ హీరోయిన్ ఇన్ స్టా ద్వారా భారీగానే సంపాదిస్తుందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ దర్శ గుప్తా. తమిళ టీవీ సీరియల్ ముల్లం మలరుమ్‌లో నటించడం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత రుద్ర తాండవం (2021), ఓ మై ఘోస్ట్ (2022) అనే రెండు చిత్రాలలో నటించి ఫేమస్ అయ్యింది.

ఈ బ్యూటీకి ఇన్ స్టాలో 2.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అటు గ్లామరస్, ఇటు ట్రెడిషనల్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. ఇన్ స్టాలో బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా ఎక్కువే సంపాదిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ నడుపుతుంది.

నెలకు రూ. 440 ప్రస్తుతం 961 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. అంటే ఈ స్ట్రీమ్ ద్వారా నెలకు రూ.4 లక్షలకు పైగా ఆదాయాన్ని రాబడుతుందట. అలాగే బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా ఎక్కువే సంపాదిస్తుంది.

దర్శ గుప్తా.. కేవలం సినిమాలు, సీరియల్స్ కాకుండా సామాజిక సేవలు చేయడంలోనూ ముందుంటుంది. కరోనా సమయంలో దాదాపు 20 వేల మందికి పైగా వసతి, వైద్య సంరక్షణ కల్పించింది. దీంతో ఆమెను హార్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ తో ఆమెను సత్కరించారు.




