AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో ఇచ్చిన సలహా ఇప్పటికీ పాటిస్తున్నా.. ఆసక్తికర విషయం చెప్పిన కాజల్

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆచితూచి సినిమాలు చేస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో మరో సినిమా చేయలేదు. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కో స్టార్స్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.

Rajeev Rayala
|

Updated on: May 24, 2026 | 2:09 PM

Share
Kటాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్.. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ ఆచితూచి సినిమాలు చేస్తుంది. భగవంత్ కేసరి సినిమా తర్వాత ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో మరో సినిమా చేయలేదు. కాగా గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కో స్టార్స్ గురించి, అల్లు అర్జున్, ప్రభాస్‌లతో తన జ్ఞాపకాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. తాను తన సహనటులందరితోనూ మంచి పని సంబంధాలను కలిగి ఉన్నానని, సెట్‌లో అందరూ సహకారంతో ఉంటారని చెప్పుకొచ్చింది. సలహాలను ఎల్లప్పుడూ స్వాగతిస్తానని, కొన్నిసార్లు సహనటులు ఇచ్చిన సలహాలను తాను ఉపయోగించి అవి విజయవంతం అయినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పడానికి వెనకాడనని కాజల్ పేర్కొన్నారు.

1 / 5
అలాంటి ఒక ముఖ్యమైన సలహాను అల్లు అర్జున్ నుండి పొందినట్లు కాజల్ గుర్తుచేసుకున్నారు. తాను స్వతహాగా ఆత్రుత కలిగిన, చురుకైన వ్యక్తిని కాజల్ తెలిపింది. డైరెక్టర్ "కట్" అని చెప్పిన వెంటనే ఆ సీన్ ఎమోష్నన్ ను వదిలేసే అలవాటు తనకు ఉండేదని, కట్ చెప్పిన వెంటనే తాను రిలాక్స్ అయ్యేదానినని ఆమె చెప్పారు. అయితే, బన్నీ తనకు "కట్" చెప్పిన తర్వాత కెమెరా బీప్ సౌండ్ వినిపించే వరకు భావోద్వేగాన్ని అలానే ఉంచమని సలహా ఇచ్చారని కాజల్ వెల్లడించారు.

2 / 5
ఇది సినిమా ఎడిటర్‌కు సులువుగా ఉంటుందని బన్నీ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ సలహా తనకు ఎంతో ఉపయోగపడిందని, దీనిని తాను ఇప్పటికీ పాటిస్తున్నానని ఆమె తెలిపారు. సహనటుల ఎత్తు గురించి అడిగినప్పుడు, తనతో నటించినవారు సాధారణంగా తనకంటే పొడవుగానే ఉంటారని, అందుకే తాను ఎక్కువ ఎత్తు ఉన్న హీల్స్ ధరించలేనని కాజల్ చెప్పుకొచ్చింది తాను సాధారణంగా 1-2 అంగుళాల హీల్స్ మాత్రమే ధరిస్తానని చెప్పారు.

3 / 5
అయితే, ప్రభాస్‌తో కలిసి పనిచేసినప్పుడు తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదనినని తెలిపింది కాజల్. డార్లింగ్ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించినప్పుడు 4-6 అంగుళాల హీల్స్ ధరించగలిగానని, స్టిలెటోస్ వంటి ఎత్తైన హీల్స్‌తో కనిపించానని ఆమె ఆనందంగా పంచుకున్నారు. ఒక నటి విజయవంతం కావడానికి గ్లామర్, నటన నైపుణ్యాలు రెండూ ముఖ్యమని కాజల్ చెప్పుకొచ్చింది.

4 / 5
అయితే తాను నటన నైపుణ్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేసింది. గ్లామర్ అంటే కేవలం అందాల ప్రదర్శన కాదని కాజల్ చెప్పుకొచ్చింది. చీరలో లేదా జీన్స్‌తో బాగా సరిపోయే ఫుల్-స్లీవ్ టీ-షర్ట్‌లో కూడా తాను చాలా గ్లామరస్‌గా కనిపించగలనని తెలిపింది. సొగసైన రూపానికి, అసభ్యంగా ఉండటానికి మధ్య ఒక సన్నని గీత ఉంటుందని కాజల్ తెలిపింది. తాను సొగసైన రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తానని, ఆ గీతను దాటి ఎప్పుడూ అసభ్యంగా ప్రవర్తించబోనని ఆమె తెలిపింది. తన తండ్రితో కలిసి సినిమా చూడలేని విధంగా తాను ఎప్పుడూ అందాల ప్రదర్శన చేయనని ఆమె తన అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసింది.  ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us