Kevvu Kartheek: ఆధ్యాత్మిక యాత్రలో జబర్దస్త్ కెవ్వు కార్తీక్.. భార్యతో కలిసి ప్రముఖ ఆలయాల సందర్శన.. ఫొటోస్

Edited By: TV9 Telugu

Updated on: Jul 01, 2025 | 6:35 PM

జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో కెవ్వు కార్తీక్ ఒకడు. మొదట ఒక సాధారణ కంటెస్టెంట్ గా ఈ షోలోకి అడుగు పెట్టిన అతను ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిపోయాడు. ఇప్పటికీ అలాగే కొనసాగుతూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

1 / 5
 మొదట మిమిక్రీ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన కార్తీక్ ఆ తరువాత జబర్దస్త్​ షోలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. మొదట ధనాధన్ రాజ్ టీమ్ లో కంటెస్టెంట్ గా చేరిన అతను  ఆ తర్వాత తిరుపతి ప్రకాశ్​ టీమ్ లోనూ మెరిశాడు.

2 / 5
 ఇక 2016లో ముక్కు అవినాష్ తో కలిసి టీమ్​ లీడర్ గా మారిపోయాడు కార్తీక్.  అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్​ లీడర్ గా కొనసాగుతున్నాడీ యాక్టర్. తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్విస్తున్నాడు

3 / 5
టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ మెరుస్తున్నాడు కార్తీక్. ముఖ చిత్రం, నేడు స్టూడెంట్ సార్ సినిమాల్లో కార్తీక్ కీలక పాత్రలు పోషించాడు.

4 / 5
 2023లో  శ్రీలేఖ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు కార్తీక్. తాజాగా ఈ దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ప్రముఖ ఆలయాల సందర్శనకు బయలు దేరారు.

5 / 5
 ఇందులో భాగంగా స్వర్ణగిరి, యాదగిరి ఆలయాలను సందర్శించారు కార్తీక్ ఫ్యామిలీ. అనంతరం ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.