మరోవైపు ప్రభాస్ మాత్రం దూకుడు మీదున్నారు. కరోనా తర్వాత రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి.. ఈ ఏడాది కల్కితో 1000 కోట్లు కొల్లగొట్టారు. రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమా, హోంబేలెతో మరో 3 చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఈ ప్లానింగ్ లేకే చరణ్, బన్నీ, తారక్ వెనకబడ్డారు. పాన్ ఇండియా మంచిదే అయినా.. ఇంత స్లోగా ఉంటే ఫ్యాన్స్‌కు దూరమైపోతారు స్టార్ హీరోలు.