Allu Arjun: ఆ స్టార్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్..

Edited By: Phani CH

Updated on: Mar 05, 2025 | 9:45 PM

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని చాలా రోజులుగా అభిమానులు వేచి చూస్తున్నారు కానీ క్లారిటీ అయితే రావట్లేదు. త్రివిక్రమ్ అంటున్నారు గానీ పరిస్థితులు చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పట్లో వర్కవుట్ అయ్యేలా కనిపించట్లేదు. మరి అట్లీతోనే అల్లు వారబ్బాయి సినిమా ఉండబోతుందా..? ఉంటే సెట్స్‌పైకి వచ్చేదెప్పుడు..?

1 / 5
పుష్ప కోసం అనుకోకుండా ఐదేళ్లు తీసుకున్నానని.. ఇకపై ఏడాదికి రెండు సినిమాలు కాకపోయినా కనీసం ఒక్కటైనా చేస్తానంటూ ఆ మధ్య అభిమానులకు ప్రామిస్ చేసారు బన్నీ. కానీ పెరిగిన మార్కెట్ దృష్ట్యా.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టమే.

2 / 5
పైగా నెక్ట్స్ సినిమా విషయంలో ఇంకా కన్ఫ్యూజన్‌లోనే ఉన్నారు అల్లు వారబ్బాయి. నిజానికి పుష్ప 2 విడుదలకు ముందే త్రివిక్రమ్ సినిమా ఖరారైంది. నిన్నమొన్నటి వరకు కూడా ఇదే ప్రాజెక్ట్ ఫైనల్ అన్నారు.

3 / 5
కానీ రెండు మూడు రోజులుగా సీన్స్ మారుతున్నాయి. సడన్‌గా రేసులోకి అట్లీ వచ్చారు. త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో ఉండకపోవచ్చని నాగవంశీ కూడా క్లారిటీ ఇచ్చారు. దాంతో అట్లీ, బన్నీ కాంబో దాదాపు ఫిక్సైపోయినట్లే. అట్లీ ప్రస్తుతం తన టీంతో అల్లు అర్జున్ కోసం స్టోరీ సిట్టింగ్స్ మొదలు పెట్టారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారు.

4 / 5
 ఈ సినిమాలో ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 5గురు హీరోయిన్లు ఉంటారని ప్రచారం జరుగుతుంది. పైగా వాళ్లంతా ఫారెన్ బ్యూటీస్ అని తెలుస్తుంది. అంతేకాదు జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయి.

5 / 5
అన్నీకుదిర్తే సమ్మర్ తర్వాత అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఏడాదిలోపే ఈ సినిమాను పూర్తి చేయాలని బన్నీ కండీషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌కు సిద్ధం కానున్నారు అల్లు అర్జున్. మొత్తానికి ఇదే లైనప్‌లో బన్నీ వెళ్తారా.. మళ్లీ ఏదైనా మార్పులు చేస్తారేమో చూడాలి.