- Telugu News Photo Gallery Cinema photos Actress ketika sharma crazy photos goes viral on social media
Ketika Sharma: స్పీడ్ పెంచిన కేతిక.. ఓ వైపు హీరోయిన్‌గా.. మరోవైపు స్పెషల్ సాంగ్
వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు. వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నది తన అందాలతో కవ్విస్తుంది.
Updated on: Feb 10, 2025 | 9:26 PM

కేతిక శర్మ 2021లో విడుదలైన రొమాంటిక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆకాష్ పూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత లక్ష్య అనే సినిమా చేసింది కానీ ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.

వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా, అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన బ్రో సినిమాలో చేసింది. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు తన నటనతో ప్రేక్షకులను కవ్వించింది ఈ అమ్మడు.

వరుసగా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ తగ్గాయి. కానీ సోషల్ మీడియాలో ఈ చిన్నది తన అందాలతో కవ్విస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు సంచలన నిర్ణయం తీసుకుంది. స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పింది ఈ చిన్నది.

నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్ చేస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేతిక స్పెషల్ సాంగ్ చేస్తుందని అనౌన్స్ చేశారు. కేతిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తన కొత్త సినిమాను అనౌన్స్ చేసింది. శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ అనే సినిమాలో కేతిక హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ సినిమా కేతికకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.




