- Telugu News Photo Gallery Cinema photos Actress anikha surendran beautiful photos goes viral in internet
Anikha Surendran: చిలక పచ్చ చీరలో చిలిపి కోయిల.. అదరగొట్టిన అనికా సురేంద్రన్
చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ. నటి అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది.
Updated on: Aug 01, 2025 | 8:52 PM

చాలా మంది చైల్డ్ యాక్టర్స్ హీరోలుగా, హీరోయిన్స్ గా మారి సినిమాలు చేస్తున్నారు. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన అనికా సురేంద్రన్ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. ఇప్పుడు తన అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ ముద్దుగుమ్మ.

నటి అనికా సురేంద్రన్ 2007లో మలయాళ చిత్రసీమలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగప్రవేశం చేసింది. దీని తరువాత, ఆమె 2014 తమిళ చిత్రం మీని ఐందాల్‌లో అజిత్ కుమార్తెగా నటించింది. ఈ సినిమాలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాదించడంతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది.

విశ్వాసం చిత్రంలోనూ అజిత్-నయనతార కూతురి పాత్రలో అనికా సురేంద్రన్ నటించిన తర్వాత, అభిమానులు ఆమెను కుట్టి నయన్ అని పిలుచుకోవడం ప్రారంభించారు. నటి అనికా సురేంద్రన్ అజిత్ కూతురేనని చాలా మంది తమిళప్రేక్షకులు అనుకున్నారు.

ఇక ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది. 18 ఏళ్లకు హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. నటుడు హిప్హాప్ ఆది నటించిన తమిళ చిత్రం పిడి సర్‌లో ప్రధాన పాత్ర పోషించింది. ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ధనుష్ దర్శకత్వంలో రూపొందిన జాబిలమ్మ నీకు అంతకోపమ సినిమాలో అనికా సురేంద్రన్ కథానాయికగా నటించింది.

తెలుగులో ఈ చిన్నది బుట్ట బొమ్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న నటి అనికా సురేంద్రన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజగా నీలం రంగు చీరలో అందమైన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.




