
చిన్న పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక తల్లిదండ్రులు వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా, పసిపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే, వారి బాధ ఎవరికీ అర్ధం కాదు. తల్లిదండ్రులే దగ్గరుండి వారి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి.

పిల్లలకు సిరప్ పోసిన వాంతి చేసుకున్నట్లయితే, అది శరీరంలోకి వెళ్ళలేదని గ్రహించండి. 20 నిముషాల లోపు వాంతి చేసుకుంటే పోసిన మందు ప్రభావం ఏం ఉండదు కాబట్టి మళ్లీ రెండో సారి వేయాలని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు సిరప్ పట్టించిన గంట తర్వాత వాంతు చేసుకుంటే కొంచం ఆలోచించాల్సిన విషయం. మీరు పోసిన సిరప్ వాంతులో కనిపిస్తే మళ్లీ ఇంకోసారి వేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.

తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే: పిల్లలకు సిరప్ పోసేటప్పుడు నోరు మొత్తం తెరిచి ఎప్పుడూ కూడా వేయొద్దు. సిరప్ వేయడానికి చిన సిరంజిని వాడాలి. ఖాళీ కడుపుతో వేసే ముందు వైద్యున్ని సంప్రదించి వేయడం మంచిది.

సిరప్ పట్టించిన ప్రతిసారీ అలాగే వాంతులు చేసుకుంటుంటే మీ దగ్గర్లో ఉన్న వైద్యున్ని సంప్రదించడం మంచిది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)