Top SUV’s: కొత్త ఏడాది మార్కెట్‌లో ఎస్‌యూవీల జాతర.. తక్కువ ధరలోనే స్టన్నింగ్‌ ఫీచర్స్‌

| Edited By: Janardhan Veluru

Dec 18, 2023 | 2:56 PM

భారతీయ ఆటోమొబైల్‌ మార్కెట్‌ ట్రెండ్‌ చూస్తుంటే కారు లవర్స్‌ ఇటీవల కాలంలో ఎస్‌యూవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అనూహ‍్య డిమాండ్స్‌ ఎస్‌యూవీల్లో అధిక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎస్‌యూవీలు అందించే కమాండింగ్‌ పొజిషన్‌ వల్ల ఈ కార్లు అధిక ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ అవసరాలు, డిమాండ్లు కాలక్రమేణ పెరిగాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో కొత్త ఏడాది అందుబాటులో ఉన్న ఎస్‌యూవీల గురించి ఓ సారి తెలుసుకుందాం.

1 / 5
భారతదేశంలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ ఫీచర్లతో వస్తున్న రిచ్‌ ఎస్‌యూవీల్లో కియా సెల్టోస్‌ ఒకటి. ఈ కారు డిజైన్‌తో పాటు ఫీచర్ల పరంగా బహుళ నవీకరణలతో ఫేస్‌లిఫ్ట్‌ డిజైన్‌తో వస్తుంది. కియా సెల్టోస్‌ అవుట్‌ గోయింగ్‌ వెర్షన్‌ ప్రారంభ ధర రూ.10.09 లక్షలుగా ఉంది. ఈ ఇంజిన్‌ 158 బీహెచ్‌పీతో వస్తుంది. ఈ కారు కేవలం 8 నుంచి 9 సెకన్స్‌లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

2 / 5
మహీంద్ర ఎక్స్‌యూవీ 700 ఎస్‌యూవీల్లో టాప్‌ ఫీచర్స్‌తో వస్తుంది. ఈ కారు 2.0 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారు 200 బీహెచ్‌పీ శక్తితో వచ్చే 9.67 సెకన్స్‌తో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.14.02 లక్షలు.

3 / 5
స్కోడా కుషాక్‌ జర్మన్‌ ఇంజినీరింగ్‌ నియంత్రణలతో ఆకర్షణీయంగా ఉండే ఎస్‌యూవీల్లో ఒకటి. ఈ కారు 7 -స్పీడ్‌ డీసీటీ ఎంపికతో 6 స్పీడ్‌ మాన్యువల్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ కారు 1.5 లీటర్ల టర్భో పెట్రోల్‌ ఇంజిన్‌ ద్వారా పని చేస్తుంది. ఈ కారు 8.6 సెకన్స్‌లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.08 లక్షలు.

4 / 5
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 కూడా ఎస్‌యూవీ కార్స్‌లో మంచి ఆకర్షణీయ ఎంపిక అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ కారు అత్యంత శక్తివంతమైన 1.2 లీటర్ల టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ సాయంతో పని చేస్తుంది. 128 బీహెచ్‌పీ పవర్‌తో పని చేసే ఈ ఎస్‌యూవీ 10.9 సెకన్స్‌లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రూ.7.99 లక్షలతో మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుంది.

5 / 5
వోక్స్‌వ్యాగన్‌ టైగన్‌ స్కోడా కుషాన్‌కు సరిసమానమైన ప్రతిపాదనలను అందిస్తుంది. ఈ కారు 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ లే 7 డీసీటీతో కలిపి పని చేసే 1.5 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఈ కారు 8.6 సెకన్స్‌లో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ.11.62 లక్షలుగా ఉంటుంది.