Best Cars Under Rs 10 Lakhs: మన దేశంలో టాప్ కార్లు ఇవే.. అనువైన ధర.. అధిక పనితీరు.. తిరుగులేని ఫీచర్స్..

| Edited By: Shaik Madar Saheb

Dec 19, 2023 | 9:14 PM

భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ప్రజలు, వ్యవహారశైలి, భాషలు, వాతావరణ పరిస్థితులు ఉంటాయి. రీజియన్ ని బట్టి మారుతుంటాయి. అదే సమయంలో వాహనాలను కొనుగోలు విషయంలో ఈ విభిన్న పరిస్థితులకు సరిపోయే విధంగా ఉండాలి. ఇదే సమయంలో దాని నాణ్యతా పనితీరుపై ప్రశ్నలు తలెత్తుంటాయి. ఎవరూ తమ వాహనాలు దారి మధ్యలో ఆగిపోవాలని అనుకోరు. మొదలైన ప్రయాణం సుఖవంతంగా సాగి, గమ్యస్థానం చేరుకోవాలని కోరుకుంటారు. ఈ క్రమంలో అటువంటి సుఖవంతమైన ప్రయాణాన్ని దేశ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా ఆయా ప్రదేశాల్లో సులభవంగా ప్రయాణించగలిగే కార్లకు మీకు పరిచయం చేస్తున్నాం. టాప్ కంపెనీలకు చెందిన ఈ కార్ల ధర రూ. 12లక్షలలోపే ఉంటుంది. వాటి గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

1 / 5
మారుతి సుజుకీ ఆల్టో కే10.. ఏళ్లుగా ఈ కారు మార్కెట్లో ఉన్నా.. వన్నెతగ్గిన కారు ఇది. ఏడాదికేడాది దీని పాపులారిటి పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. అనువైన బడ్జెట్లో లభించడమే కాకుండా మంచి నాణ్యమైన పనితీరును ఇది అందిస్తుంది. ప్రధానంగా దీనివైపు చూసేలా చేసే విషయం దీని ధర. ఇది కేవలం రూ. 3.99లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ ఉంటుంది. ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుంది. ఎటువంటి ప్రదేశంలోనైనా సులువుగా వెళ్లగలుగుతుంది.

2 / 5

హోండా అమేజ్.. ఈ కారు అనువైన బడ్జెట్లో లభించే బెస్ట్ సెడాన్. ఈ సబ్ కాంపాక్ట్ సెడాన్ హెచ్ బ్యాడ్జ్ తో ఇది వస్తుంది. ఇది కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్న అందివ్వడం తో పాటు నాణ్యమైన పనితీరుని అందిస్తుంది. దీని ధర రూ. 7.10లక్షలు(ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో 1.2 లీటర్ ఐ-వీటెక్ ఇంజిన్ ఉంటుంది.

3 / 5
మారుతి సుజుకీ స్విఫ్ట్.. ఈ కారు కూడా మన దేశంలో అత్యంత పాపులారిటీ సంపాదించింది. చిన్నగా కనిపించే ఈ కారు స్పోర్టీ లుక్ లో ఉంటుంది. దీనికి తక్కువ మెయింటెనెన్స్ అవసరం అవుతుంది. అధిన పనితీరును అందిస్తుంది. ప్రస్తుతం న్యూ జనరేషన్ స్విఫ్ట్ ను సుజుకీ మన దేశంలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. దీని ధర రూ. 5.99లక్షలు(ఎక్ష్ షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో 1.2 లీటర్ కే సిరీస్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది.

4 / 5
హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్.. ఈ సౌత్ కొరియా కారు తయారీదారు నుంచి వస్తున్న చిన్న హ్యాచ్ బ్యాక్ ఇది. మన దేశంలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. దీనిలో 1.2 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో పాటు 5 స్పీడ్ ఏఎంటీ వెర్షన్ కూడా ఉంటుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 5.84లక్షలు(ఎక్స్ షోరూం) ఉంటుంది.

5 / 5

టోయోటా అర్బన్ క్రూయిజర్ హై రైడర్.. ఈ కారు అత్యాధునిక ఫీచర్లలో లోడైన ఎస్ యూవీ. జపనీస్ ఆటోమేకర్ కు చెందిన ఈ కారుకు మన దేశంలో మంచి డిమాండే ఉంది. దీనిలో 1.5 లీటర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్ తో పాటు హైబ్రీడ్ పవర్ ట్రెయిన్ తో వస్తుంది. మంచి పనితీరుతో పాటు నాణ్యమైన అవుట్ పుట్ ను అందిస్తుంది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర రూ. 10.86లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది.