AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సింపుల్‌ ట్రిక్స్‌.. నకిలీ బంగారాన్ని ఇట్టే గుర్తుపట్టొచ్చు! మనమే ట్రై చేయొచ్చు

బంగారం ధరలు పెరిగేకొద్దీ నకిలీల ప్రమాదం పెరుగుతోంది. ఇంట్లోనే కొన్ని సులభమైన పరీక్షలతో బంగారం అసలుదో కాదో గుర్తించవచ్చు. హాల్‌మార్క్, అయస్కాంత, నీటి, సిరామిక్, వినిగర్ పరీక్షల ద్వారా స్వచ్ఛతను ప్రాథమికంగా నిర్ధారించుకోవచ్చు. ముఖ్యంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో మోసపోకుండా ఈ పద్ధతులు ఉపయోగపడతాయి.

SN Pasha
|

Updated on: May 10, 2026 | 9:30 AM

Share
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ బంగారం విక్రయాల ప్రమాదం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే సరైన అవగాహన లేకపోతే నకిలీ లేదా తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారం చేతికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సులభమైన పరీక్షల ద్వారా ఇంట్లోనే బంగారం అసలుదో కాదో ప్రాథమికంగా గుర్తించవచ్చని చెబుతున్నారు.

1 / 5
మొదటగా హాల్‌మార్క్‌ను పరిశీలించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో అమ్మే బంగారు ఆభరణాలపై సాధారణంగా బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటుంది. దీనిపై క్యారెట్ వివరాలు, బీఐఎస్ లోగో, జువెలర్ గుర్తింపు సంఖ్య ఉంటాయి. ఇవి లేకపోతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

2 / 5
అలాగే అయస్కాంత పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. అసలైన బంగారం అయస్కాంతానికి ఆకర్షితమవదు. ఒక చిన్న మాగ్నెట్‌ను బంగారం దగ్గర ఉంచితే అది అతుక్కుంటే అందులో ఇతర లోహాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరీక్ష మాత్రమే పూర్తిగా సరిపోదని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
నీటి పరీక్ష ద్వారా కూడా ప్రాథమికంగా అంచనా వేయవచ్చు. బంగారం సాంద్రత ఎక్కువగా ఉండటంతో నీటిలో వెంటనే అడుగుకు చేరుతుంది. నకిలీ బంగారం లేదా తక్కువ నాణ్యత గల మిశ్రమ లోహాలు కొన్నిసార్లు తేలే అవకాశం ఉంటుంది.

4 / 5
సిరామిక్ పరీక్ష కూడా ఒక పద్ధతి. గాజు లేదా తెల్లని సిరామిక్ పలకపై బంగారాన్ని మెల్లగా రుద్దితే బంగారు రంగు గీత పడితే అది అసలైన బంగారం అయ్యే అవకాశం ఉంటుంది. నల్లటి గీత వస్తే నకిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వినిగర్ పరీక్ష కూడా చాలామంది ఉపయోగిస్తారు. బంగారంపై కొద్దిగా వినిగర్ వేస్తే రంగు మారకపోతే అది అసలైనదై ఉండవచ్చు. నకిలీ బంగారం అయితే రంగు మారే అవకాశం ఉంటుంది.

5 / 5
Follow Us