Central Government: సామాన్యుల కోసం కేంద్రం అదిరిపోయే పథకం.. ప్రతీ ఏడాది అకౌంట్లోకి డబ్బులు.. ప్రతీఒక్కరికీ..

Updated on: Oct 20, 2026 | 4:45 PM

కేంద ప్రభుత్వం అద్బుత స్కీమ్ సామాన్యుల కోసం తీసుకొచ్చింది. అదే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పథకంలో ఇప్పటికే లక్షలాది మంది చేరారు. మీరు జమ చేసే నగదుపై ప్రతీ ఏడాది వడ్డీ పొందవచ్చు. ఆ తర్వాత చక్రవడ్డీ కూడా ఇందులో లభిస్తుంది.

1 / 5
కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం నిర్వహిస్తోంది. అతి తక్కువ మొత్తం నుంచి వీటిల్లో డబ్బులు పొదుపు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. కనీసం రూ.వెయ్యి నుంచి కూడా పెట్టుబడి మొదలుపెట్టవచ్చు. తక్కువ మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునే సామాన్య ప్రజలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగపడతాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పథకాలు కావడంతో నిధులకు భద్రత కూడా ఉంటుంది. అలాగే మీ డబ్బులకు ఎటువంటి రిస్క్ కూడా ఉండదు.

2 / 5
తక్కువ పొదుపుతో ఎక్కువ లాభం పొందాలనుకునేవారి కోసం కేంద్రం ఒక అద్బుత స్కీమ్ తీసుకొచ్చింది. అదే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్(NSC). ఇందులో వడ్డీ రేటు అత్యధికంగా 7.7 శాతం పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటు 6 శాతమే ఉంటుంది. దానికి బదులు ఈ ప్రభుత్వ స్కీములో ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ రేటు పొందవచ్చు. అంతేకాక చక్రవడ్డీ కూడా జమ అవుతుంది.

3 / 5
మినిమం రూ.వెయ్యి నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు. వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. భారత పౌరులై ఉండాలి.  ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం మినహాయింపులు కూడా పొందవచ్చు. ఈ అకౌంట్‌కు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అయితే అకౌంట్ హోల్డర్ మరణిస్తే మధ్యలోనే అప్పటివరకు జమ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇక కోర్డు ఆర్డర్ ప్రకారం కూడా మధ్యలో నిధులు ఉపసంహరించుకోవచ్చు.

4 / 5
పోస్టాఫీసులో ఈ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇక ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ తరహాలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఎన్‌ఆర్‌ఐలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి నిబంధనలు అంగీకరించవు. ఇందులోని పెట్టుబడులకు ఏడాదికి రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది.

5 / 5
ఇక మైనర్ల పేరుపై కూడా నేషనల్ సేవింగ్స్ అకౌంట్ తెరవొచ్చు. కాకపోతే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఆ అకౌంట్‌ను నిర్వహించాలి. చిన్నారులకు 18 ఏళ్లు నిండాక వాళ్లు సొంతగా నిర్వహించుకోవచ్చు. పథకం వడ్డీ రేట్లలో మార్పులు జరగొచ్చు. 2020లో వడ్డీ రేటు 8 శాతంగా ఉండగా.. ప్రస్తుతం 7.7 శాతంగా కేంద్రం ఫిక్స్ చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us