AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pan Card: పాన్ కార్డు వాడేవారికి బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. ఆ లిమిట్ దాటితే..

ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పాన్ కార్డ్ రూల్స్ రాబోతున్నాయి. బ్యాంకుల్లో నగదు డిపాజిట్, విత్ డ్రాలకు పాన్ వినియోగానికి సంబంధించి పరిమితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఇక భూముల అమ్మకం, వాహనాల కొనుగోళ్ల సమయంలో పాన్ సమర్పరణ రూల్స్ మారాయి.

Venkatrao Lella
|

Updated on: Mar 27, 2026 | 4:55 PM

Share
ఏప్రిల్ 1 నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ అమల్లోకి రాబోతున్నాయి. పాన్ కార్డు వాడే ప్రతీఒక్కరిని ఈ కొత్త నియమాలు ప్రభావితం చేయనున్నాయి. ఇప్పటివరకు వీటిని ఉపయోగించి చేసే బ్యాంక్ లావాదేవీలకు పరిమితులు మరింత పెంచారు. బ్యాంక్ డిపాజిట్లు, విత్ డ్రా, స్థలాల క్రయవిక్రయాల వంటి కార్యకలాపాల్లో పాన్ వినియోగానికి సంబంధించి కొత్త నిబంధనలు రానున్నాయి. అవేంటో చూద్దాం.

1 / 5
ఇప్పటివరకు ఒక రోజులో ఏదైనా బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కవ విత్ డ్రా చేయాలన్నా లేదా డిపాజిట్ చేయాలన్నా పాన్ కార్డు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పటినుంచి ఇందులో మార్పులు చోటుచేసుకున్నాయి. ఒక ఆర్ధిక సంవత్సరంలో బ్యాంక్ అకౌంట్‌లో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు డిపాజిట్ చేసినా లేదా విత్ డ్రా చేసినా పాన్ వివరాలు అందించాల్సి ఉంటుంది. అలాగే భూముల అమ్మకం, విక్రయంకి సంబంధించి పాన్ విషయంలో మార్పులు చోటుచేసుకున్నాయి.

2 / 5
ఇక నుంచి ఇళ్లు లేదా స్థలాలు కొనుగోళ్లకు సంబంధించి రూ.20 లక్షలకు మంచి లావాదేవీలు జరిగితే పాన్ సమర్పించాలి. ఇక బహుమతి, ఉమ్మడి డెవలప్‌మెంట్ ఒప్పందాల లావాదేవీలకు కూడా అదే పరిమితి వర్తించనుంది. ఇక ఏదైనా వెహికల్ కొనుగోలు చేసినప్పుడు రూ.5 లక్షల ధర దాటితే పాన్ వివరాలు అందించాల్సి ఉంటుందని ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది.

3 / 5
ఇక కంపెనీ నుంచి ఉద్యో్గికి ఇచ్చే మీల్స్ కూపన్లపై మినహాయింపు పరిమితిని పెంచారు. ఆ లిమిట్‌ను నాలుగుసార్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఒక్కొ మీల్స్‌కు రూ.50 నుంచి రూ.200కి పెంచారు. పాత, కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ రెజిమీకి ఈ నిబంధనలు వర్తిస్తాయి. యజమాని రోజుకు రెండు మీల్స్ కూపన్లు అందిస్తే.. ఏడాదికి రూ.1,05,600 అవుతుంది. దీంతో ఉద్యోగులు వీటి తర్వాత రూ.1.05 లక్షలకుపైగా ప్రయోజనం పొందవచ్చు.

4 / 5
ఇక పిల్లల విద్యా భత్యాన్ని నెలకు రూ.100 నుంచి రూ.3 వేకకు పెంచారు. గరిష్టంగా ఇద్దరు పిల్లల వరకు ఈ ప్రయోజనం పొందవచ్చు. ఇక హాస్టల్ ఖర్చు భత్యాన్ని నెలకు రూ.300 నుంచి రూ.9 వేలకు పెంచారు. ఇది కూడా ఇద్దరు పిల్లకు వర్తించనుంది. ఇక హెచ్‌ఆర్ విషయంలో 50 శాతం పన్ను మినహాయింపు ఏప్రిల్ 1 నుంచి పొందవచ్చు.

5 / 5
Follow Us