LPG Gas Rules: కేంద్రం కొత్త ఎల్పీజీ గ్యాస్ రూల్స్.. సిలిండర్లు వాడేవారు ఇది మర్చిపోవద్దు.. ఇబ్బందులు తప్పవ్..

Updated on: Oct 05, 2026 | 7:03 AM

కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త ఎల్పీజీ గ్యాస్ రూల్స్ తీసుకొచ్చింది. కేవైసీని ఈ నెల నుంచి తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నవారందరూ కేవైసీ పూర్తి చేయాలి. కమర్షియల్ సిలిండర్లు వాడేవారికి ఇది అవసరం లేదు.

1 / 5
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు బిగ్ అలర్ట్. ఎల్పీజీ సిలిండర్ రూల్స్‌లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. అదేంటంటే.. అక్టోబర్ 1 నుంచి గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. అంటే తప్పనిసరిగా ఆధార్ ఆధారిత ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండాలి. లేకపోతే సిలిండర్లపై అందిస్తున్న సబ్సిడీలు తాత్కాలికంగా రద్దు అవుతాయి.

2 / 5
ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత తిరిగి సబ్సిడీ నిధులు అందే ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే కేవైసీ పూర్తి చేసుకోనివారికి సిలిండర్ల రీఫిల్లింగ్ పొందటంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు  తెలుస్తోంది. సబ్సిడీతో కూడిన సిలిండర్లు పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేయాలి. లేకపోతే రిటైల్ అమ్మకపు ధరకే గ్యాస్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

3 / 5
ఇప్పటికే కేవైసీ పూర్తి చేసినవారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదు. వారికి యథావిధిగా సబ్సిడీలు అందుతాయి. చేయనివారికి సబ్సిడీలు నిలిచిపోతాయి. దీని వల్ల మార్కెట్ ధరకే సిలిండర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని వల్ల వారికే నష్టమని చెప్పవచ్చు. వీరికి కేవైసీ పూర్తి చేసిన తర్వాత సబ్సిడీతో కూడిన సిలిండర్ పొందే అవకాశముంటుంది.

4 / 5
అంతేకానీ కేవైసీ పూర్తి చేయనంత మాత్రాన గ్యాస్ డెలివరీలు నిలిచిపోవని, యథావిధిగా సరఫరా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం సబ్సిడీ మాత్రం అందదని తెలిపింది. 2026 సెప్టెంబర్ లెక్కల ప్రకారం 24.73 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారుల కేవైసీ పూర్తి చేశారు. మొత్తం వినియోగదారుల్లో 89.9 శాతం మంది కంప్లీట్ చేశారు

5 / 5
వినియోగదారులు సులువుగా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం డెలివరీ బాయ్ వద్ద ఉండే OMC మొబైల్ అప్లికేషన్‌ను ఉపయోగించి సులువుగా చేసుకోవచ్చు. ఇక గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కంప్లీట్ చేయొచ్చు. అలాగే మీకు గ్యాస్ సరఫరా చేస్తే కంపెనీకి సంబంధించి పోర్టల్, యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో పూర్తి చేయవచ్చు. ఇలా అనేక మార్గాల్లో గ్యాస్ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us