Gas Cylinder: గ్యాస్ సిలిండర్లకు కేంద్రం కొత్త రూల్స్.. ఇక ఇది తప్పనిసరి.. లేకపోతే ఇబ్బందులే..

Updated on: Oct 01, 2026 | 5:16 PM

గ్యాస్ వినియోగదారులకు అలర్ట్. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఎల్పీజీ సిలిండర్లకు ఆధార్ అథెంటికేషన్ ధృవీకరణ ప్రక్రియను తప్పనిసరి చేసింది. నేటి నుంచి ఈ కొత్త నిబంధనలను కేంద్రం ప్రకటించింది. ఈ ప్రాసెస్ పూర్తి చేయకపోతే సబ్సిడీ కట్ కానుంది.

1 / 5
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు అక్టోబర్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీతో కూడిన డొమెస్టిక్ సిలిండర్లు వాడుతున్నవారికి ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. సబ్సిడీ పొందాలంటే తప్పనిసరిగా ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసి ఉండాలి. లేకపోతే ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీ కట్ అవుతుంది. దీంతో మార్కెట్ ధరలకే సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

2 / 5
ఎల్పీజీ సబ్సిడీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, నకిలీ, అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సబ్సిడీపై పొందే సిలిండర్లకు ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. అక్టోబర్ నుంచి వచ్చిన ఈ కొత్త మార్పులను ప్రతీఒక్కరూ తప్పనిసరిగా గమనించాలని కేంద్రం కోరింది.
అయితే ఇప్పటికే ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసినవారికి ఈ ప్రక్రియ అవసరం లేదు.

ఎల్పీజీ సబ్సిడీలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, నకిలీ, అనర్హులను గుర్తించేందుకు కేంద్రం సబ్సిడీపై పొందే సిలిండర్లకు ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. అక్టోబర్ నుంచి వచ్చిన ఈ కొత్త మార్పులను ప్రతీఒక్కరూ తప్పనిసరిగా గమనించాలని కేంద్రం కోరింది. అయితే ఇప్పటికే ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి చేసినవారికి ఈ ప్రక్రియ అవసరం లేదు.

3 / 5
సెప్టెంబర్ 19 నాటికి 27.43 కోట్ల మంది యాక్టివ్ డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేశారు. అంటే 89.9 శాతం మంది పూర్తి చేశారు. మిగిలినవారు కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలని కేంద్రం పదే పదే సూచించింది. కానీ కొంతమంది ఇంకా పూర్తి చేసుకోలేదు. వీరికి సబ్సిడీ నిధులు కట్ కానున్నాయి. దీంతో మార్కెట్ ధరలకే గ్యాస్ సిలిండర్ లభించనుంది.

4 / 5
కానీ ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయకపోతే కేవలం సబ్సిడీ మాత్రమే నిలిచిపోతుంది. అంతేకానీ గ్యాస్ డెలివరీ మాత్రం నిలిచిపోదు. ఎప్పటిలాగే గ్యాస్ బుక్ చేసుకుని డెలివరీ పొందవచ్చు. హోటళ్లు, రెస్టారెంట్ల లాంటి కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించే వాణిజ్య సిలిండర్లకు ఆధార్ ధృవీకరణ ప్రక్రియ అవసరం లేదు. ఆ సిలిండర్లు సబ్సిడీ పరిధిలోకి రావు. కేవలం గృహ సిలిండర్లు మాత్రమే సబ్సిడీ పరిధిలోకి వస్తాయి.

5 / 5
గ్యాస్ డెలివరీ సమయంలో ఏజెన్సీ సిబ్బంది వద్ద ఉండే బయోమెట్రిక్ మెషిన్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. లేదా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్ సైట్, యాప్స్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు

Loading...
Unable to load recommendations.
Follow Us