
పండుగల సమయంలో భారతీయులు బంగారం ఎక్కువగా కొంటూ ఉంటారు. పండుగల సమయంలో బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. త్వరలో దీపావళి పండుగ రానుండటంతో.. పసిడి కొంటే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ కారణంగా దీపావళికి బంగారం కొనాలని చాలామంది భావిస్తున్నారు.

త్వరలో దీపావళి పండుగ రానున్న సమయంలో బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశముంది. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు ఎగబాకే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చూస్తే ధరలు గత కొద్ది నెలలుగా తగ్గుతూ వస్తోన్నాయి. జనవరిలో ఆల్ టైం రికార్డ్ స్థాయికి చేరుకున్న ధరలు వరుసగా పతనమవుతూ వస్తోన్నాయి

ప్రస్తుతం 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం హైదరాబాద్‌లో రూ.1,47,170 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,34,900 వద్ద ట్రేడవుతోంది. మరి కొద్ది రోజుల్లో దీపావళి రానున్న క్రమంలో ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. అయితే బంగారం ధరల పెరుగుదల అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ పరిస్థితులు, దేశీయ డిమాండ్‌ను బట్టి ధరలు మారుతుంటాయి.

భౌగోళిక రాజకీయ పరిణామాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దీపావళి రానుండటం, పెళ్లిళ్ల సీజన్ కూడా స్టార్ట్ కానున్న క్రమంలో ధరలు కాస్త పెరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లను అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ పెంచే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇదే జరిగితే పసిడి ధరలపై ఒత్తిడి పెరగవొచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల కొంతకాలంగా బంగారం ధరలు తగ్గుతుండటంతో భారతీయులకు ఉపశమనం లభించింది. అయితే ధరలు నిలకడగా కొనసాగుతాయని హామీ ఇవ్వలేమని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. పండుగ డిమాండ్ కారణంగా దేశీయంగా ధరలు పెరగవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు, భారత రూపాయిలో హెచ్చుతగ్గులు, ప్రపంచ పరిణామాలను గమనిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.