
బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే శుభవార్త అందింది. గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. గంటల వ్యవధిలోనే ధరలు భారీగా పతనాన్ని నమోదు చేస్తాయి. త్వరలో పండుగలు రానున్న క్రమంలో బంగారం కొనేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు ఎగిరి గంతేస్తున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన దేశంలోని వివిధ సిటీలలో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రూ.1,54,310 వద్ద కొనసాగుతోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.1040 మేర క్రాష్ అయ్యాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,41,450గా ఉండగా.. నేడు రూ.950 తగ్గిందని చెప్పవచ్చు. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,310, 22 క్యారెట్ల రేటు రూ.1,41,150 వద్ద కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే రూ.వెయ్యి మేర డౌన్ అయ్యి ఊరట కల్పించాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,680 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,710 వద్ద ట్రేడవుతున్నాయి.

డిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,510 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,560గా ఉంది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,49,900గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,54,900గా ఉంది.

పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో ధరలు తగ్గడం ఉపశమనంగా చెప్పవచ్చు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. అలాగే ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలుపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ధరలు తగ్గుతూ వస్తోన్నాయని నిపుణులు చెబుతున్నారు.