Gold Prices: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పతనం.. లేటెస్ట్ ధరలు ఇవే..

Updated on: Feb 16, 2026 | 10:12 AM

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. గత రెండు వారాల క్రితం పసిడి ధరలు ఆల్ టైం రికాక్డ్ స్థాయికి చేరుకోగా.. ఇప్పుడు పతనమవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ వస్తున్న క్రమంలో గోల్డ్ రేట్లు తగ్గడం శుభపరిణామం.

1 / 5
బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్. గోల్డ్ రేట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు సద్దుమణగడంతో పసిడి ధరలు శాంతిస్తున్నాయి. ఇప్పుడు మరింతగా తగ్గుతున్నాయి. రష్యా-అమెరికా మధ్య వాణిజ్యపరంగా సానుకూల పరిస్థితులు ఏర్పడితే గోల్డ్ రేట్లు మరింత తగ్గొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి.

2 / 5
సోమవారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఒకేసారి రూ.1310 గోల్డ్ రేటు తగ్గింది. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం రేటు రూ.1,57,750 వద్ద స్థిరపడగా.. ఇవాళ రూ.1,56,440కి పడిపోయాయి. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు ప్రస్తుతం రూ.1,43,400 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,44,600గా ఉంది. నిన్నటితో పోలిస్తే ధర రూ.1200 తగ్గింది.

3 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా అవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల ఫ్యూర్ గోల్డ్ ధర రూ.1,57,530గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,58,740 వద్ద స్ధిరపడింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,44,400 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,45,600గా ఉంది.

4 / 5
అటు బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,440 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,400గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,590 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,550గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1200 మేర ధర తగ్గిందని చెప్పవచ్చు.

5 / 5
అటు ఢిల్లీలో కేజీ వెండిపై సోమవారం రూ.7 వేలు తగ్గింది. నిన్న కేజీ సిల్వర్ ధర రూ.2,75,000 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.2.68 లక్షలుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నగరంలో రూ.2.80 లక్షల వద్ద ట్రేడువుతున్నాయి. ఇక చెన్నైలో కూడా రూ.2.80 లక్షల వద్ద ఉన్నాయి.