Gold Prices: మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. ఒక్కసారిగా పేలిన బాంబ్.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Updated on: Apr 08, 2026 | 9:55 AM

అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్‌తో యుద్దంపై ట్రంప్ ప్రకటన క్రమంలో స్టాక్ మార్కెట్లు ఊగిసలాటలో కొనసాగుతున్నాయి. ఇక అంతర్జాతీయ పరిణామాలకు బంగారం ధరలు త్వరగా ప్రభావితం అవుతాయి. అందలో భాగంగా ట్రంప్ ఎఫెక్ట్ పసిడి ధరలపై పడింది. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

1 / 5
బంగారం ధరలు ఊహించని షాకిచ్చాయి. గంటల వ్యవధిలోనే ధరలు మారాయి. ఇరాన్‌తో యుద్దానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో పసిడి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ కూడా యుద్దానికి గ్యాప్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో గోల్డ్, సిల్వర్ రేట్లల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. బుధవారం గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పెరిగాయి.

2 / 5
ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,820 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,49,840 వద్ద స్ధిరపడింది. అంటే నిన్నటితో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.3980 పెరిగింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,41,000 వద్ద కొనసాగుతోంది. నిన్న ఇదే ధర రూ.1,37,350 వద్ద కొనసాగింది. ఇవాళ ఏకంగా రూ.3650 పెరిగిందని చెప్పవచ్చు.

3 / 5
ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలు కొనసాగుతున్నాయి. ఇక చెన్నైలో ఇవాళ రూ.1,51,190 వద్ద ఉన్నాయి. నిన్న రూ.1,51,200 వద్ద స్ధిరపడ్డాయి. ఇక 22 క్యారెట్ల ధర అక్కడ రూ.1,38,590గా ఉండగా.. నిన్న రూ.1,38,600గా ఉంది. అటు బెంగళూరులో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.1,53,820గా ఉండగా.. 22 క్యారెట్ల రేట్లు చూస్తే రూ.1,41,000 వద్ద ఉన్నాయి.

4 / 5
ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,970 వద్ద ఉండగా.. నిన్న ఇవే ధరలు రూ.1,49,990 వద్ద స్థిరపడ్డాయి. ఇక 22 క్యారెట్ల రేటు నిన్న రూ.1,37,500 వద్ద ఉండగా.. బుధవారం రూ.1,41,150 వద్ద కొనసాగుతున్నాయి. ఇక సిల్వర్ రేట్లు కూడా భారీగా పెరిగాయి.

5 / 5
ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర ప్రస్తుతం రూ.2.60 లక్షలుగా ఉంది. ఇది నిన్న రూ.2.50 లక్షలుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.10 వేలు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.2,54,900గా ఉండగా.. మంగళవారం రూ.2.55 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో కూడా రూ.2.54 లక్షల వద్ద ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us