Gold Rate: భారీ పతనం.. రూ.10 వేలు తగ్గిన బంగారం ధర.. కుప్పకూలుతున్న వెండి

Updated on: Nov 13, 2026 | 11:10 AM

Gold, Silver Prices: అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 3 శాతం పడిపోయిన పసిడి ధర ఔన్సుకు 3,880 డాలర్ల స్థాయికి చేరింది. ఒక దశలో 13 నెలల కనిష్ట స్థాయిని కూడా తాకింది..

1 / 5
Gold, Silver Rates: ఈ రోజు బంగారం, వెండి ధరల్లో భారీ తగ్గుదల కనిపించింది. రికార్డు స్థాయిలో దిగి వస్తోంది. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. బంగారం కొనాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నవారికి శుభవార్తేనని చెప్పొచ్చు. గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎవ్వరు ఊహించని విధంగా పతనమవుతోంది. ఒక్కసారిగా పాతాళానికి పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు ఏడాది కనిష్ట స్థాయికి చేరువలో ట్రేడవుతుండటంతో కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరుగుతోంది. అయితే నెల రోజుల్లో బంగారం ధర రూ.10 వేలకుపై తగ్గుముఖం పట్టింది.

2 / 5
 తాజాగా నవంబర్‌ 13న ఉదయం పదిన్నర గంటల సమయంలో తులంపై ఏకంగా 1310 రూపాయలు  తగ్గుముఖం పట్టింది. ధర తగ్గిన తర్వాత తులం బంగారం ధర రూ.1,38,490కి చేరుకుంది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండిపై స్వల్పంగా తగ్గి ప్రస్తుతం రూ.1,99,900 వద్దకు చేరుకుంది.

3 / 5
 వారం రోజుల కిందట తులం బంగారం ధర రూ.1,43,460 ఉండగా, ఇప్పుడు రూ.1,38,490కి చేరుకుంది. అంటే వారం రోజుల్లోనే ఏకంగా 4,970 రూపాయలు తగ్గింది. ఇదే నెల  5వ తేదీతో ధరలను పోల్చితే ఏకంగా రూ.7,530 వరకు తగ్గుముఖం పట్టింది. ఇదిలా ఉంటే గత ఇదే తేదీ అంటే అక్టోబర్‌ 13న తులం ధర రూ.1,49,290 వద్ద ఉండగా, ప్రస్తుతం ఉన్న ధరలతో పోలిస్తే.. ఏకంగా రూ.10,800 తగ్గింది.

4 / 5
 ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనాలనుకునేవారికి ధరల తగ్గుదల కొంత ఊరటనిస్తోంది. అయితే ఈ ధరల పతనానికి అసలు కారణం ఏంటి? మళ్లీ బంగారం ధరలు పెరుగుతాయా? ఇప్పుడు కొనుగోలు చేయడం సరైన నిర్ణయమేనా? తెలుసుకుందాం.

5 / 5
 అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధరలు భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 3 శాతం పడిపోయిన పసిడి ధర ఔన్సుకు 3,880 డాలర్ల స్థాయికి చేరింది. ఒక దశలో 13 నెలల కనిష్ట స్థాయిని కూడా తాకింది. ఆ తర్వాత స్వల్పంగా కోలుకుని ఔన్సుకు 3,881.02 డాలర్ల వద్ద ట్రేడయింది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగి ఔన్సుకు 50.11 డాలర్లకు చేరుకుంది. ప్లాటినం, పల్లాడియం ధరల్లోనూ స్వల్ప పెరుగుదల నమోదైంది.

Loading...
Unable to load recommendations.
Follow Us