Electric Scooters: భారతదేశంలో టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. తక్కువ ధరల్లో బెస్ట్‌ మైలేజీ..!

Updated on: Apr 04, 2026 | 12:36 PM

Top Electric Scooters: మార్కెట్లో టాప్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు హవా కొనసాగిస్తున్నాయి. మీరు దృఢమైన బాడీ కోరుకుంటే బజాజ్ చేతక్, ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే TVS iQube ST, లేదా ఫ్యామిలీ కోసం అయితే ఏథర్ రిజ్తాను ఎంచుకోవచ్చు. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోండి..

1 / 5
1. టీవీఎస్‌ ఐక్యూబ్‌ (TVS iQube): టీవీఎస్ మోటార్ కంపెనీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా TVS iQube దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా నిలిచింది. ఇది మూడు వేరియంట్లలో లభిస్తుంది. iQube, iQube S, iQube ST. ధర విషయానికొస్తే బేస్ మోడల్ ధర రూ.94,999 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కాగా, హై-ఎండ్ ఎస్టీ వేరియంట్ ధర రూ.1.61 లక్షల వరకు ఉంటుంది. బ్యాటరీ ప్యాక్‌ను బట్టి ఇది 94 కి.మీ నుండి 212 కి.మీ వరకు రేంజ్ ఇస్తుంది. ఇందులో గరిష్టంగా 5.3 kWh బ్యాటరీ అందుబాటులో ఉంది.

2 / 5
2. ఏథర్ రిజ్తా (Ather Rizta): కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా రూపొందించిన Ather Rizta దాని ఫంక్షనల్ డిజైన్, అద్భుతమైన ఫీచర్ల వల్ల తక్కువ కాలంలోనే ప్రాచుర్యం పొందింది. ఇది సౌకర్యానికి, ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తుంది. రూ.1.04 లక్షల నుండి ప్రారంభమై రూ.1.30 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. వేరియంట్‌ను బట్టి ఇది 123 కి.మీ, 159 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.

3 / 5
బజాజ్ చేతక్ (Bajaj Chetak): బజాజ్ చేతక్ ఈవీ దాని ఆల్-మెటల్ బాడీతో మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇతర ప్లాస్టిక్ బాడీ స్కూటర్లతో పోలిస్తే ఇది మరింత దృఢంగా, మన్నికగా ఉంటుంది. ఇందులో C2501, C3001, C35 సిరీస్ వంటి మోడల్స్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.89,500 (ఎక్స్-షోరూమ్) కాగా, ప్రీమియం వేరియంట్ రూ.1.22 లక్షల వరకు ఉంటుంది. ఇది 113 కి.మీ నుండి 151 కి.మీ మధ్య రేంజ్ ఇస్తుంది.

4 / 5
4. సుజుకి ఇయాక్సెస్ (Suzuki e Access): సుజుకి కంపెనీ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్ Suzuki e Access. ఇది సుజుకి నమ్మకమైన ఇంజనీరింగ్‌తో రూపొందించారు. దీని ప్రారంభ ధర రూ.1.88  లక్షలు (ఎక్స్-షోరూమ్). అలాగే రేంజ్‌ విషయానికొస్తే.. 3.072 kWh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే ఈ స్కూటర్ ఒకే ఛార్జ్‌పై 95 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

5 / 5
మీరు దృఢమైన బాడీ కోరుకుంటే బజాజ్ చేతక్, ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే TVS iQube ST, లేదా ఫ్యామిలీ కోసం అయితే ఏథర్ రిజ్తాను ఎంచుకోవచ్చు. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకోండి.

Follow Us