Indian Currency: రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..? ప్రభుత్వం చెప్పిన లెక్కలివే..

Updated on: Oct 02, 2026 | 7:23 PM

భారతదేశంలో ఒక రూపాయి నాణెం ఉత్పత్తి ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం.. ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి భారత ప్రభుత్వానికి ఒక రూపాయి 11 పైసలు ఖర్చు అవుతోంది. అంటే ప్రతి రూపాయి నాణెం ఉత్పత్తిపై ప్రభుత్వానికి 11 పైసల నష్టం వస్తుంది.

1 / 5
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నా.. చాలామంది నాణెంలు, కరెన్సీ నోట్లు ఉపయోగిస్తున్నారు. ఏదైనా కొనుగోలు చేసినప్పుడు క్యాష్ రూపంలో డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే చిన్ననాటి నుండి మనకు అత్యంత సుపరిచితమైన రూపాయి నాణెం గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. దాని విలువ కంటే తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుందట. రూపాయి నాణెం తయారీకి అసలు ఎంత ఖర్చు అవుతుందనేది చూద్దాం.

2 / 5
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం.. భారత ప్రభుత్వం ఒక రూపాయి నాణెం ఉత్పత్తి చేయడానికి రూ.1.11 పైసలు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే ప్రతి రూపాయి నాణెం తయారీపై ప్రభుత్వానికి 11 పైసల నష్టం వస్తోంది. రూపాయి విలువ కంటే దాని తయారీకి ఎక్కువ ఖర్చు అవుతుండటం వల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. ఆశ్చర్యకరంగా ఇతర నాణేల ఉత్పత్తి ప్రభుత్వానికి లాభదాయకంగా ఉంది.

3 / 5
రెండు రూపాయల నాణెం తయారీకి రూ.1.28 పైసలు ఖర్చు అవుతుండగా.. ఐదు రూపాయల నాణెం తయారీకి రూ.3.69 పైసలు, అలాగే పది రూపాయల నాణెం తయారీకి కేవలం రూ.5.54 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ నాణేల ముఖ విలువ వాటి తయారీ ఖర్చు కంటే ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వానికి వాటిపై లాభం లభిస్తోంది. ఒక రూపాయి నాణెం తయారీకి మాత్రమే అధిక వ్యయం అవుతుంది.

4 / 5
భారతదేశంలో నాణేలు ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోని ప్రభుత్వ మింట్‌లలో తయారవుతాయి. ఒక రూపాయి నాణెం సాధారణంగా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తారు. నాణేలతో పోలిస్తే కరెన్సీ నోట్ల ముద్రణ ప్రభుత్వానికి చాలా ఎక్కువ లాభదాయకం. ఆర్బీఐ డేటా ప్రకారం.. నోట్ల ముద్రణ ఖర్చు వాటి ముఖ విలువ కంటే చాలా తక్కువగా ఉంటుంది.

5 / 5
రూ.500 నోటు ముద్రించేందుకు దాదాపు రూ.2.29 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. రూ.200 నోటుకు రూ.2.37 పైసలు ఖర్చవుతుంది. రూ.100 నోటుకు కేవలం రూ.1.77 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ గణాంకాలు పరిశీలిస్తే.. కరెన్సీ నోట్లు, ఇతర డినామినేషన్ నాణేలు ప్రభుత్వానికి లాభదాయకంగా ఉండగా.. ఒక రూపాయి నాణెం మాత్రమే భారం అవుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us