Bone Health: ఈ అలవాట్లు ఉంటే.. చిన్న వయసులోనే ఎముకలు బలహీనమై కీళ్ల నొప్పులు దాడి చేస్తాయ్‌

|

Oct 15, 2024 | 8:53 PM

వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గి సమస్యలు పుట్టుకొస్తాయి. కానీ నేటి కాలంలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడం ప్రారంభమవుతుంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి..

1 / 5
నేటి కాలంలో ప్రతి ఇంట్లోనూ చేతులు, కాళ్లలో నొప్పులతో బాధపడేవారు సర్వసాధారణం అయిపోయారు. మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎముకల సమస్య ఉంటే ముందుగా చేయాల్సింది క్యాల్షియం, విటమిన్ డి మందులు తీసుకోవడం.

2 / 5
చిన్నవయసులో నేలపై కూర్చోవడానికి ఇబ్బంది, మోకాళ్లు వంచడంలో ఇబ్బంది, మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లలో నొప్పి, బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు వీపు, భుజాలు, చేతులు నొప్పి వంటివి బలహీన ఎముకలను సూచించే లక్షణాలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పోషకాహారం సక్రమంగా లేకపోవడం వల్ల ఎముకల బలం తగ్గుతుంది. క్రమంగా ఎముక క్షీణత ప్రారంభమవుతుంది. ఇవి మందులతో మాత్రమే నయం అయ్యేది కాదు. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి.

3 / 5
బరువును అదుపులో ఉంచుకోవడం ఎముక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. శరీర అధిక బరువు నడుము, మోకాలు, చీలమండలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. కావున ముందుగా బరువును అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే ఎముకల సమస్యలు తీవ్రమవుతాయి. ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. తప్పుడు భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల వీపు, మెడ లేదా నిర్మాణ సమస్యలకు ఆటంకం కలుగుతుంది. ఎక్కువ సేపు హీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెన్ను సమస్యలు వస్తాయి.

4 / 5
బరువు నియంత్రణ లేదా ఎముకల ఆరోగ్యం ఈ రెండింటికీ రెగ్యులర్ వ్యాయామం మంచిది. శరీరంలోని వివిధ కీళ్ల చుట్టూ కండరాలు బలంగా లేకుంటే, గాయం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి నడక, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి క్రమం తప్పకుండా చేయడం అవసరం.

5 / 5
వ్యాయామం చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు సౌకర్యంగాలేని బూట్లు ధరించడం వల్ల ఎముకల సమస్యలు వస్తాయి. సౌకర్యవంతమైన బూట్లు ధరించకపోతే పాదాల నరాలు, లిగమెంట్లు ఒత్తిడికి గురవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ప్రయోజనం కంటే హాని కలిగించే అవకాశం ఎక్కువ.