బోనాల స్పెషల్ : పల్లెటూరి స్టైల్ యాటకూర.. ఎలా వండాలో తెలుసా?

Updated on: Aug 09, 2026 | 9:19 AM

హైదరాబాద్‌లో బోనాల పండుగ షురూ అయ్యి, ముగింపు దశకు వచ్చేసింది. ఇక ఆదివారం రోజున భాగ్యనగరంలో ఘనంగా బోనాల పండుగ జరుగుతుంది. ఇక ఈ రోజు చాలా మంది యాటలను బలిచ్చి ఇంటిలో భోజనాలు పెడుతుంటారు. కాగా, ఇప్పుడు మనం బోనాల పండుగ సందర్భంగా ఇంటిలో పల్లెటూరి స్టైల్‌లో యాటకూర ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5
యాట కూర వండటానికి కావాల్సిన పదార్థాలు : యాటక కూర, ఉల్లిపాయలు అరకేజీ, పచ్చి మిర్చీ పావు కేజీ, వెల్లుల్లి రెబ్బలు, 8 , పల్లీలు వేయించినవి కప్పు, పసుపు, కారం, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన ధనియాల పౌడర్, బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, నిమ్మకాయ, కొత్తిమీర, పూదీనా, కస్తూరీ మేతి.

2 / 5
తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మేక లేదా పొట్టేల్ మాసం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వెంటనే కట్టెల పొయ్యిలో మంచిగా మంట పెట్టాలి. దానిపై బౌల్ పెట్టాలి. పది కేజీల మటన్ కర్రీకి, 12 కేజీలు ఉడికే బౌల్ పెట్టాలి. పెద్ద సైజులో ఉండటం వలన ముక్కగా చాలా త్వరగా ఉడుకుతుంది.

3 / 5
ఇప్పుడు అందులో సరిపడ నూనె వేయాలి. అందులో బిర్యానీ ఆకు, షాజీరా, అనాసపువ్వు, దాల్చిన చెక్క, కస్తూరీ మేతి, లవంగాలు అన్నీ వేయాలి. అందులో పచ్చి మిర్చీ, ఆనియన్స్ అన్నీ వేసుకొని మంచిగా మంట పెట్టాలి. అవి గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

4 / 5
ఇప్పుడు, అన్నీ బాగా వేగిన తర్వాత అందులో మటన్ కర్రీ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ దాదాపు 20 నిమిషాలు ఉడకబెట్టాలి. తర్వాత అందులో సరిపడ నీళ్లు పోయాలి. నీళ్లు పోయడం వలన ముక్క చాలా త్వరగా మెత్తగా ఉడుకుంది. దాదాపు 30 నిమిషాల తర్వాత మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు అందులో కొబ్బరి పొడి వేసి మంచిగా కలుపుకోవాలి.

5 / 5
తర్వాత అందులో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, అన్నీ వేసి మంచిగా కలిపి, మరో పదినిమిషాలు, గ్రేవీ చిక్కగా వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ముక్క మొత్తం మంచిగా ఉడికిన తర్వాత రెండు నిమిషాల్లో కర్రీ దించేస్తాం అనే సమయంలో పూదీనా, కొత్తిమీర వేయాలి. నిమిషం తర్వాత పొయ్యి మీద నుంచి కర్రీని తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే యాట కూర రెడీ.

Loading...
Unable to load recommendations.
Follow Us