నీచు వాసన రాకుండా చేసే బొమ్మిడాల పులుసు.. ఇలా చేపల పులుసు పెడితే అదిరిపోయే టేస్ట్!

Updated on: Nov 25, 2026 | 12:41 PM

ప్రత్యేక రుచిని కలిగి ఉండే బొమ్మిడాల చేపల కర్రీ, సరైన విధంగా వండితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే చేపల వాసన నచ్చని వారు కూడా లొట్టలేసుకొని మరీ తినేంత రుచి వస్తుంది. బొమ్మిడి చేపల కర్రీని అస్సలు నీచు వాసన రాకుండా, సులువుగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
బొమ్మిడి చేపలు చూడటానికి పొడవుగా ఉంటాయి. ముందుగా, చేపలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.కట్ చేసుకున్న చేప ముక్కలను వాటర్‌లో రెండు, మూడు సార్లు బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఇసుక, దుమ్ము వంటివి పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత, ఒక బౌల్‌లో చేపల ముక్కలు మునిగేంత వాటర్ పోసి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల నీచు వాసన పూర్తిగా తొలగిపోతుంది.

3 / 5
స్టవ్ ఆన్ చేసి, ఒక పాన్ పెట్టి అందులో మూడు, నాలుగు టేబుల్‌స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత, 1/4 టీస్పూన్ ఆవాలు, 1/4 టీస్పూన్ జీలకర్ర, 1/4 టీస్పూన్ మెంతులు వేసి వేయించాలి. మెంతులు వేయడం ఈ కర్రీకి ప్రత్యేక రుచిని, సువాసనను అందిస్తుంది. అవి ఫ్రై అయిన తర్వాత, పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కూరలో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు ఒక నిమిషం పాటు ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత, కొన్ని కరివేపాకు రెమ్మలు, ఫ్రెష్‌గా నూరుకున్న ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి.

4 / 5
 అన్నీ బాగా వేగిన తర్వాత, నానబెట్టిన బొమ్మిడి చేపల నుండి వాటర్‌ను వంపేసి, చేపల ముక్కలను పాన్‌లోని ఆయిల్ లో వేయాలి. కలుపుతూ కేవలం ఒక నిమిషం పాటు ఆయిల్ లో ఫ్రై చేయాలి. ఒక నిమిషం తర్వాత, దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం వేయాలి. మూడు టేబుల్‌స్పూన్ల కారంపొడి, ఒక టేబుల్‌స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ కర్రీకి కారం, ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుంది, అలాగే నీచు వాసన కూడా రాదు. ఉప్పు, కారం వేసి రెండు నిమిషాల పాటు సిమ్‌లో ఫ్రై చేయాలి.

5 / 5
ఉప్పు, కారం చేపలకు బాగా పట్టిన తర్వాత, 1/2 కేజీ సన్నగా తరిగిన టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్‌లో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి.ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి ఉంటుంది, అంటే కర్రీ దాదాపు పూర్తయినట్లే. ఇప్పుడు ఒక టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేయాలి. చివరిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి, మీడియం ఫ్లేమ్‌లో మరో నిమిషం పాటు ఉడికించాలి. ఈ కర్రీలో నీళ్ళు  పోయకుండా ఇలాగే చేస్తేనే బాగుంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాత కర్రీ కొంచెం చిక్కగా మారుతుంది. ఇలాగే ఉంటే చపాతీ, రోటి, రైస్‌లోకి సూపర్ గా ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us