
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 100 గ్రాముల పనీర్‌లో దాదాపు 3 ఉడికించిన గుడ్లకు సమానమైన ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే 100 గ్రాముల పనీర్ (సుమారు 18-22 గ్రాముల ప్రోటీన్)లో 3 పెద్ద గుడ్లకు (గుడ్డుకు దాదాపు 6-7 గ్రాములు, మొత్తం 18-21 గ్రాములు) ఉన్నంత ప్రోటీన్ ఉంటుంది.

పనీర్ లోని పోషకాలు కాటేజ్ చీజ్‌లో ప్రోటీన్, కాల్షియం, భాస్వరం, విటమిన్ బి12, విటమిన్ ఎ, జింక్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. కాటేజ్ చీజ్‌ను వివిధ మార్గాల్లో ఆహారంలో చేర్చుకోవచ్చు.

గుడ్లు పూర్తి ప్రోటీన్‌కు మూలం. అంటే.. ఇందులో మన శరీరానికి అవసరమైన అన్ని తొమ్మిది రకాల ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు ఉంటాయి. శాకాహారులకు అవసరం అయిన ప్రొటీన్ పన్నీర్‌లో ఉంటుంది. ఇందులో కాల్షియం ,ఫాస్ఫరస్ అధికంగా ఉండటం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.

విటమిన్ డి ఉన్న అతి కొద్ది ఆహార పదార్థాలలో గుడ్లు ఒకటి. ఇది ఎముకల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా ముఖ్యం. గుడ్లలోని కోలిన్ మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి సహాయ పడుతుంది. గుడ్లు జీర్ణమవడం సులభం అంతే కాకుండా ఇవి తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్‌ను అందిస్తాయి.

పనీర్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది చాలా బాగా సహాయ పడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. అందుకే ఇవి శరీరానికి శక్తిని అందిస్తాయి.