AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రక్తాన్ని చిటికెలో పెంచే బీట్‌రూట్ పల్లీల చట్నీ

రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడంలో బీట్‌రూట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి రక్త హీనతతో బాధ పడేవారు బీట్రూట్ పల్లీల చట్నీని ఎంచక్కా తినొచ్చు. అయితే ఈ పచ్చడిని రోటిలో చేసుకుంటే మంచి రుచి వస్తుంది మిక్సీలో చేసుకుంటే మరి అంత టేస్ట్ రాదు

Prasanna Yadla
|

Updated on: May 29, 2026 | 6:14 PM

Share
బీట్రూట్ పల్లీల చట్నీకి  కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు, 100  గ్రాముల పల్లీలు, 150 గ్రాములు పచ్చి మిర్చి, నాలుగు టమాటాలు, ఇంకా నాలుగు వెల్లుల్లి, అర టీ స్పూన్ పసుపు, నిమ్మకాయంత  చింతపండు, నూనెను తీసుకోవాలి వీటిని సరైన కొలతలతో చేసుకుంటే టేస్టీగా ఉంటుంది.  మీరు ఈ రెసిపీని చదివి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి.

1 / 5
ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, అది  బాగా వేడయ్యక  దానిలో బీట్ రూట్ ముక్కలు, నాలుగు పచ్చి మిర్చి, టమాటాలు కూడా వేసి బాగా మగ్గించాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా చింత పండును కూడా వేసి పచ్చి వాసన  పోయే వరకు వీటిని బాగా మగ్గించాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

2 / 5
అయితే ఈ పచ్చడిని రోటిలో చేసుకుంటే మంచి రుచి వస్తుంది మిక్సీలో  చేసుకుంటే మరి అంత టేస్ట్ రాదు. ముందుగా వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, బీట్రూట్ ముక్కలు,  ఎండుమిర్చి బాగా నూరుకోవాలి.  చివర్లో దీనిలో ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా దంచుకోవాలి. దీనిలో  కొద్దిగా చింతపండు వేస్తే మంట ఉన్నా కూడా బ్యాలెన్స్ చేస్తుంది.
ఇంకా రుచికి తగినంత ఉప్పును కూడా దీనిలో వేస్తే టేస్ట్ అదిరిపోతోంది.

అయితే ఈ పచ్చడిని రోటిలో చేసుకుంటే మంచి రుచి వస్తుంది మిక్సీలో చేసుకుంటే మరి అంత టేస్ట్ రాదు. ముందుగా వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, బీట్రూట్ ముక్కలు, ఎండుమిర్చి బాగా నూరుకోవాలి. చివర్లో దీనిలో ఉల్లిపాయ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా దంచుకోవాలి. దీనిలో కొద్దిగా చింతపండు వేస్తే మంట ఉన్నా కూడా బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా రుచికి తగినంత ఉప్పును కూడా దీనిలో వేస్తే టేస్ట్ అదిరిపోతోంది.

3 / 5
నూరిన పచ్చడి మిశ్రమం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పాన్ తీసుకుని బాగా వేడయ్యాక దానిలో  అర టేబుల్ స్పూన్ మినపప్పు , వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , ఎండు మిర్చిని కూడా వేసి బాగా వేయించాలి. ఈ తాలింపు తీసుకుని బీట్రూట్ పల్లీల  పచ్చడి వేసి  కలపాలి. ఈ పచ్చడి టేస్టీగా రావాలంటే దానిలో  ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా మంచి రుచిగా ఉంటుంది. చట్నీ  మంచిగా రావాలంటే దీనిలో నీళ్లు పోస్తే సరిపోతుంది.

4 / 5
రక్తంలో హిమోగ్లోబిన్ పెంచడంలో బీట్‌రూట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి రక్త హీనతతో బాధ పడేవారు దీనిని ఎంచక్కా తినొచ్చు .(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us