
మధుమేహం నియంత్రణ: అరటి పువ్వులో ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరిచే, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని తగ్గించే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల డయాబెటిస్ బాధితుల్లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

కీళ్ల నొప్పులు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది: వయసు పెరిగే కొద్దీ లేదా యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల వచ్చే కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో అరటి పువ్వులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఎంతో సహాయపడతాయి. ఇది కీళ్లలో వచ్చే మంటను తగ్గించి శారీరక ఉపశమనాన్ని ఇస్తుంది.

రక్తహీనత నివారణ: అరటి పువ్వులో ఐరన్ లభించే అత్యంత ముఖ్యమైన పోషకం. శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండి రక్తహీనతతో బాధపడేవారు అరటి పువ్వు కర్రీ లేదా పప్పులో వేసుకుని తినడం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది.

మహిళ ఆరోగ్యానికి మేలైన సహాయకారి: మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను సరిచేయడంలో ఇది బాగా తోడ్పడుతుంది. ముఖ్యంగా నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన కడుపు నొప్పి, అధిక రక్తస్రావాన్ని అరికట్టడంలో, ప్రొజెస్టెరాన్ హార్మోన్‌ను సమతుల్యంగా ఉంచడంలో అరటి పువ్వు అద్భుతంగా పనిచేస్తుంది.

జీర్ణవ్యవస్థ పనితీరు, బరువు తగ్గుదల: ఇందులో ఉండే సమృద్ధియైన డైటరీ ఫైబర్ జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి, కడుపు నిండిన భావనను కలిగించి బరువు తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది. అంతేకాదు..అరటి పువ్వులో ఉండే మెగ్నీషియం మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి మంచి నిద్రను రప్పిస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.