Aydodya Ram Temple: అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి ఆరు నెలల ముందే.. హోటల్స్‌కు పెరిగిన గిరాకీ

|

Jul 21, 2023 | 10:12 AM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం జనవరిలో ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే అక్కడ హోటళ్లు, రిసార్డులకు సంబంధించిగా జోరుగా బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఆలయం ప్రారంభానికి ఆరు నెలలు ఉండగానే చాలామంది భక్తులు గదులను రిజర్వు చేసుకుంటున్నారు.

1 / 5

2 / 5
వివిధ రాజకీయ పార్టీలు జనవరి 12 నుంచి 24 తేదీల మధ్య పెద్ద మొత్తంలో గదులను బుకింగ్స్ చేసుకున్నాయి. అయితే జనవరిలో మకర సంక్రాంతి సందర్భంగా అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి అంకురార్పన చేయాలని ఆలయ ట్రస్ట్‌ సభ్యులు భావిస్తున్నారు.

3 / 5
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవాన్ని ఎంతోమంది ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. 
15 రోజుల పాటు అయోధ్యలో గదులు కావాలంటూ ఢిల్లీ, ముంబయి సహా అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

అయోధ్య రామాలయం ప్రారంభోత్సవాన్ని ఎంతోమంది ప్రత్యక్షంగా చూడాలని ఆశపడుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. 15 రోజుల పాటు అయోధ్యలో గదులు కావాలంటూ ఢిల్లీ, ముంబయి సహా అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు.

4 / 5
అయోధ్య నగరంతో పాటు చూట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు 150 కి పైగా హోటళ్లు ఉన్నాయి. అలాగే వీటితోసహా 35 గుర్తింపు లేని గెస్ట్ హౌస్‌లు, 50 ధర్మశాలల, 50 హోం స్టేలు ఉన్నాయి. వీటన్నింటిని కలిపితే మొత్తం 10 వేల వరకు గదులు ఉంటాయి.

5 / 5
మరోవైపు ప్రభుత్వం కూడా 50 చిన్నపాటి అతిథి గృహాలను నిర్మిస్తోంది. వీటి నిర్మాణం నవంబర్ వరకు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా జనవరి 22న రామ్‌లల్లా విగ్రహావిష్కరణ చేపట్టవచ్చని.. జనవరి 24 నుంచి భక్తులకు ఆలయ ప్రవేశం ఉంటుందని.. అధికారులు చెబుతున్నారు.