- Telugu News Photo Gallery Anti aging cream: Use this homemade anti aging cream to reduce your age by 10 years
Skin Care Tips: ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే మీ వయసు 10 ఏళ్లు తగ్గిపోతుంది..
వృద్ధాప్యం చర్మంపై ప్రభావం చూపుతుంది. అధిక వయసు కారణంగా ఏర్పడే ముడతలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అయితే చాలా మందికి వయస్సు పెరగకముందే చర్మం ముడతలు పడి, వదులుగా కనిపిస్తుంది. చాలా మంది వయసును దాచడానికి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఫేషియల్స్‌లో అనేక రకాల రసాయనాలను ఉపయోగించడం వల్ల అవి చర్మంపై అనేక రకాల చెడు ప్రభావాలను చూపుతాయి..
Updated on: Nov 15, 2023 | 7:12 PM

వృద్ధాప్యం చర్మంపై ప్రభావం చూపుతుంది. అధిక వయసు కారణంగా ఏర్పడే ముడతలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అయితే చాలా మందికి వయస్సు పెరగకముందే చర్మం ముడతలు పడి, వదులుగా కనిపిస్తుంది. చాలా మంది వయసును దాచడానికి ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. ఫేషియల్స్‌లో అనేక రకాల రసాయనాలను ఉపయోగించడం వల్ల అవి చర్మంపై అనేక రకాల చెడు ప్రభావాలను చూపుతాయి.

చర్మ సంరక్షణలో హోం రెమెడీస్ బెస్ట్ అంటున్నారు సౌందర్య నిపుణులు. ప్రతి రోజు ఇంట్లో వినియోగించే బియ్యం పిండిని సౌందర్య సంరక్షణలో ఉపయోగించవచ్చని అంటున్నారు. ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ, కొబ్బరి నూనె, ఒక స్పూన్ పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ స్క్రబ్ శీతాకాలంలో బాగా పనిచేస్తుంది. స్నానానికి ముందు ఈ స్క్రబ్‌ని ఉపయోగించవచ్చు.

పొడి చర్మం సోరియాసిస్, ఎగ్జిమా వంటి వివిధ చర్మ సమస్యలను కలిగిస్తుంది. శీతాకాలంలో అవి మరింత తీవ్రమవుతాయి. అయితే ఈ సీజన్‌లో కొబ్బరినూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్ లేదా అవకాడో ఆయిల్‌ని రోజూ వాడితే చర్మం హైడ్రేట్‌గా ఉండి మృదువుగా ఉంటుంది.

ఈ ప్యాక్ చర్మాన్ని సాఫ్ట్ గా మార్చుతుంది. ఇలా వరుసగా మూడు రోజులు వాడితే చాలా మంచి ఫలితం కనిపిస్తుంది. శీతాకాలంలో ఏర్పడే పగుళ్లు, చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ ప్యాక్‌ను అప్లై చేసిన తర్వాత ఆరనివ్వాలి. అనంతరం కళ్ల కింద రెండవ పొరను వేసుకోవాలి.

15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు కూడా తొలగిపోతాయి. అలాగే చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. తర్వాత తేలికపాటి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం నునుపుగా, ప్రకావవంతంగా కనిపిస్తుంది.




