
పాలగుండ జున్నుకు కావల్సిన పదార్థాలు: ఒక లీటర్ తాజా పాలు, 250 గ్రాముల బెల్లం పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం ఇవి పాలు విరిగిపోవడానికి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పులు తీసుకోవాలి. ఇంకా ఇది చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి.

పాలగుండ జున్నుకు తయారీ విధానం: ముందుగా పాలను మరిగించుకోవాలి . పాలను పాన్ లో పోసి మీడియం మంటపై బాగా మరిగించాలి. ఆ తరవాత పాలు విరిగిపోవడానికి దానిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే అవి వెంటనే విరిగిపోతాయి. ఇంకా ఇవి కలిపితే పాలు కూడా పాడవుతాయి. దీని నుంచి నీరు కూడా వేరు అవుతుంది

ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒక క్లాత్ లో వేసి, దీనిలో ఉన్న నీరు మొత్తం వంపేసి మిగిలిన జున్నును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఐతే ఇది మెత్తగా ఉండకుండా చూసుకోండి. పిండి కొంచం గట్టిగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో కొద్దిగా జున్ను వేసి బెల్లం పొడి కూడా దీనిలో కలిపి మీడియం మంట పై కలుపుతూ ఉంచాలి.

ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా దీనిలో వేయించిన జీడిపప్పు, 10 కిస్మిస్ లు దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం కొంచం గట్టిగాఅయిన తర్వాత నెయ్యి రాసిన తరవాత వీటిని ఒక గిన్నెలో పోసి బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు

అంతే, పాలగుండ జున్ను రెడీ. ఇది అతి ప్రాచీన వంటకం ఈ పాలగుండ జున్నును 6 నెలల పిల్లల నుండి 60 ఏళ్ల పెద్దల వరకు బాగా తినొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారు చేయాలో పైన చదివి మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేసుకోండి.