
కావాల్సిన పదార్థాలు : అరకిలో చేపల ముక్కలు, 8 ఉసిరికాయలు, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 3 పచ్చిమిర్చి , 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , కారం – 2 టీస్పూన్లు, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, పసుపు అర టీస్పూన్, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు అర టీస్పూన్, మెంతులు – చిటికెడు, 2 కరివేపాకు రెమ్మలు, కొత్తిమీర, చింతపండు , నూనె , ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు తగినన్ని తీసుకోవాలి.

ముందుగా చేపల ముక్కలను తీసుకుని బాగా కడిగి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు విడిగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల చేపల నీచు వాసన తగ్గుతుంది. ఇంకా ఇప్పుడు 4 ఉసిరికాయలను తీసుకుని బాగా కడిగి చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిలోని గింజలను తీసి వేయాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి ఉసిరికాయ ముక్కలను వేయించాలి.

అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. ఆ తరవాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి. అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. ఆ తరవాత 4 టమాటా ముక్కలు వేసి ఉడికించుకోవాలి.

ఇవి మెత్తబడిన తర్వాత కొద్దిగా కారం, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. మసాలాలు కూడా వేసి నూనె పైకి తేలే వరకు దీనిని వేయించాలి. వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను వేసి మసాలాలు కూడా దీనిలో కలపాలి. ఆ తర్వాత దీనిలో నీళ్లు పోసి ఇంకా మూతపెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి.

ఇంకా ఉసిరికాయల పులుపు చేపలకు పట్టే వరకు ఉంచాలి ఆ తరవాత చేపల ముక్కలను ఒక్కొక్కటిగా మీరు జాగ్రత్తగా వేయించాలి. ఇంకా చేపల ముక్కలు విరిగిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు మూత గట్టిగా పెట్టి మీడియం మంటపై ఉంచి 10 నుంచి 12 నిమిషాల పాటు మంచిగా ఉడికే వరకు ఉంచాలి. ఇంకా అవసరమైతే రుచిని బట్టి చింతపండు రసం కలుపుకోవచ్చు. దించే ముందు కొత్తిమీర చల్లి దించుకోవాలి.