Winter Food Tips: ధర తక్కువ.. ఆరోగ్య ప్రయోజనాల్లో మిన్న మొక్కజొన్న.. శీతాకాలం సూపర్ ఫుడ్ అని ఎందుకంటారంటే..

|

Dec 29, 2023 | 1:25 PM

ప్రకృతి మనిషికి కావాల్సిన ఔషదాలను అందిస్తోంది. ఎ సీజన్ లో దొరికే వస్తువులను ఆ సీజన్ లో ఆహారంగా తీసుకోవడం వలన.. ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులను తట్టుకునే రోగానిరోధక శక్తిని ఇస్తాయి. దీంతో అనేక వ్యాధుల బారి నుంచి రక్షణ లభిస్తుంది. అలాంటి సీజనల్ ఫుడ్ లో ఒకటి మొక్కజొన్న. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడివేడిగా మొక్క జొన్న పొత్తులను తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మొక్కజొన్న కేవలం ఆస్వాదించడానికే కాదు.. దీనిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా అనేకం..

1 / 7
తక్కువ ధరలో దొరుకుతాయి.. మొక్క‌జొన్న‌ పొత్తులను కాల్చుకుని, ఉడికించుకుని తింటారు.  మొక్కజొన్న గింజలతో పేలాల‌ను, పాప్ కార్న్ ను, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటిని త‌యారు చేస్తారు. అంతేకాదు రకరకాల ఆహారపదార్ధాల తయారు చేసుకుని తింటారు.  ఆరోగ్యానికి మొక్కజొన్న మిన్న అని కూడా చెప్పవచ్చు.

2 / 7
మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉడికించిన, కాల్చిన, మొక్కజొన్న ఏ రూపంలో ఉన్నా ఆరోగ్యానికి మంచిది. మొక్కజొన్నలో పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మొక్కజొన్న ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

3 / 7
అధిక స్థాయి చెడు కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే మొక్కజొన్నలోని యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4 / 7
మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. మొక్కజొన్న తింటే తక్షణ శక్తి వస్తుంది. నిత్యం వ్యాయామం చేసేవారు, జిమ్‌లకు వెళ్లేవారు, క్రీడాకారులు తమ ఆహారంలో మొక్కజొన్నను చేర్చుకుంటారు. మొక్కజొన్నను అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.

5 / 7
శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి మొక్కజొన్న తినవచ్చు. మొక్కజొన్నలోని ఫైబర్ మిమ్మల్ని ఎక్కువ సమయం కడుపుని నిండుగా ఉంచుతుంది. ఫలితంగా అదనపు కేలరీలను తీసుకోకుండా నివారించవచ్చు

6 / 7
మొక్కజొన్న లేదా స్వీట్ కార్న్‌లో లుటిన్, జియాక్సంతిన్ అనే రెండు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఇవి వయస్సు సంబంధిత కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

7 / 7
మొక్కజొన్నలో విటమిన్ సి ఉంటుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మొక్కజొన్నలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మం వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.