Aloe Vera for Hair: ఒత్తైన.. పొడవాటి.. నల్లని కురులు కావాలా? అయితే కలబందను ఇలా వాడేయండి

|

Nov 15, 2024 | 8:48 PM

కొంతమందికి అకారణంగా జుట్టు రాలిపోతూ ఉంటుంది. ఎన్ని ప్రొడక్ట్ లు వాడినా ఫలితం కనిపించదు. ఇలాంటి వారికి కలబంద బలేగా పనిచేస్తుంది. వారానికి రెండు సార్లు ఈ కింది విధంగా కలబంద అప్లై చేస్తే జుట్టుకు పోషణ అంది చక్కగా పెరుగుతుంది..

1 / 5
కలబంద ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది చర్మ సౌందర్యం కోసం కలబందను ఉపయోగిస్తారు. కలబంద చర్మానికే కాదు జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అలోవెరా చర్మం, జుట్టు సమస్యలను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో కలబందకు మించిన రెమెడీ వేరొకటి లేదంటే అతిశయోక్తి కాదు.

2 / 5
కలబందలో రెండు రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని, అందాన్ని మెరిపిస్తుంది. నేటి కాలంలో చాలా మందికి జుట్టు రాలడం పెరుగుతోంది. పోషకాలు లేకుంటే జుట్టు పల్చగా మారుతుంది. అయితే జుట్టు పెరుగుదలకు కలబందను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
ఒక గిన్నె తీసుకుని.. దానిలో నాలుగు చెంచాల కలబంద గుజ్జు వేయాలి. ఆ తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకోవాలి.

4 / 5
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. మీ జుట్టు రకాన్ని బట్టి కలబంద, నూనె కలుపుకోవాలి. జుట్టుకు అప్లై చేసిన తర్వాత.. కాసేపు మృదువుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది.

5 / 5
అనంతరం గంటసేపు అలాగే ఉంచి తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు మందంగా, పొడవుగా పెరుగుతుంది.