ఐపీఎల్ 12వ సీజన్ విజయవంతంగా ముగిసింది. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగుతో ముంబై కప్‌ను సొంతం చేసుకుంది. దీంతో నాలుగోసారి ఐపీఎల్ కప్‌ను దక్కించుకున్న ముంబై.. అధిక సార్లు గెలిచిన టీమ్‌గా కూడా రికార్డు సృష్టించింది.