అందుబాటులోకి రైల్వే కొత్త సేవలు.. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికే మందులు..!

కరోనా ప్రభావంతో కదలలేని ఉద్యోగులకు ఒక కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే శాఖ. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రైల్వే ఉద్యోగులకు మెడిసిన్‌ చేరేవేసే సేవలను అందిస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ సిబ్బంది సేవలను వినియోగించుకుని మెడిసిన్‌ అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రైల్వే రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌, వర్కింగ్‌ ఉద్యోగులు మందుల కోసం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా వారు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారి […]

అందుబాటులోకి రైల్వే కొత్త సేవలు.. ఒక్క ఫోన్ కాల్ తో ఇంటికే మందులు..!
Follow us

|

Updated on: May 29, 2020 | 3:45 PM

కరోనా ప్రభావంతో కదలలేని ఉద్యోగులకు ఒక కొత్త సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది భారతీయ రైల్వే శాఖ. దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రైల్వే ఉద్యోగులకు మెడిసిన్‌ చేరేవేసే సేవలను అందిస్తున్నారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ సిబ్బంది సేవలను వినియోగించుకుని మెడిసిన్‌ అందిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రైల్వే రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌, వర్కింగ్‌ ఉద్యోగులు మందుల కోసం ఆసుపత్రికి వస్తుంటారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా వారు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారి ఇంటి వద్దకే మెడిసిన్‌ పంపించి అండగా నిలిచారు. మెడిసిన్‌ అవసరమయ్యే వ్యక్తి ఫోన్‌ చేసి రైల్వే కార్డు వివరాలతో పాటు డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌, చిరునామా, మెడికల్‌ బుక్‌, ఫోన్‌ నంబర్‌ వంటి తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను ఓపీ పేపర్‌లో నమోదు చేసి వారికి కావాల్సిన మెడిసిన్‌ను ప్యాక్‌ చేస్తారు. ఆ మెడిసిన్‌ను ఇంటికి చేర్చడానికి స్కౌట్‌ అండ్‌ గైడ్స్‌ సిబ్బంది పనిచేస్తున్నారు. మందులు అందించే వ్యక్తులు గ్లౌజ్‌లు, మాస్కులు తప్పనిసరిగా ధరించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెడ్‌జోన్‌లో ఉన్న ప్రాంతాలకు కూడా వెళ్లి మందులు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 1130 మంది రైల్వే ఉద్యోగులకు మెడిసిన్‌ అందించారు. గ్రేటర్‌ హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 9701370 555కు ఫోన్‌ చేసి వివరాలిస్తే మెడిసిన్‌ ఇంటికి చేరుతుందని నర్సింగ్‌ ఆఫీసర్‌ లీలా శివమూర్తి వెల్లడించారు.

Latest Articles