రాజధానిపై పవన్‌కల్యాణ్ లేటెస్ట్ స్టాండ్.. అదిరిందిగా!

ఏపీ రాజధాని విషయం కాస్తా.. మండలి రద్దు మీదకు మళ్ళిన నేపథ్యంలో అమరావతి రైతుల ఆందోళన గత నాలుగైదు రోజులుగా మరుగున పడిన పరిస్థితి కనిపిస్తోంది. మండలి రద్దుపైనే అందరు ఫోకస్ చేయడంతో రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమంపై మీడియా కూడా కాస్తా కన్ను మరల్చిన పరిస్థితి. తాజాగా మండలి విషయంలో ప్రభుత్వం చేయగలిగింది చేసి చేతులు దులుపుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు మళ్ళీ ఆందోళన దిశగా దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, జనసేన పార్టీలు ఇవాళ […]

రాజధానిపై పవన్‌కల్యాణ్ లేటెస్ట్ స్టాండ్.. అదిరిందిగా!
Follow us

|

Updated on: Jan 28, 2020 | 6:27 PM

ఏపీ రాజధాని విషయం కాస్తా.. మండలి రద్దు మీదకు మళ్ళిన నేపథ్యంలో అమరావతి రైతుల ఆందోళన గత నాలుగైదు రోజులుగా మరుగున పడిన పరిస్థితి కనిపిస్తోంది. మండలి రద్దుపైనే అందరు ఫోకస్ చేయడంతో రైతులు, ప్రజలు చేస్తున్న ఉద్యమంపై మీడియా కూడా కాస్తా కన్ను మరల్చిన పరిస్థితి. తాజాగా మండలి విషయంలో ప్రభుత్వం చేయగలిగింది చేసి చేతులు దులుపుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు మళ్ళీ ఆందోళన దిశగా దృష్టి సారిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, జనసేన పార్టీలు ఇవాళ కీలక నిర్ణయం తీసుకున్నాయి.

ఒకవైపు సినిమా షూటింగ్.. ఇంకోవైపు రాజకీయం.. ఇలా రెండు బాధ్యతల్లో తలమునకలై వున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు అండగా నిలిచేందుకు ఉపక్రమిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం నాడు బీజేపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. బీజేపీతో జతకట్టిన నాడు ప్రకటించినట్లుగానే రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం కమిటీ ఏర్పాటు చేసి, వారితో మంగళవారం భేటీ అయ్యారు.

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా వెళ్ళి, వారికి అండగా నిలవాలని ఉభయ పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రైతులకు భరోసా కల్పించాలని, అమరావతి రాజధాని విషయంలో ఉభయ పార్టీలు కలిసి ఉమ్మడి పోరాటం చేయాలని సంకల్పించాయి. ఈ సమావేశానికి బీజేపీ తరపున దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి హాజరయ్యారు. జనసేన పక్షాన నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్, కందుల దుర్గేష్ హాజరయ్యారు.

రాజధాని మార్పు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై సుదీర్ఘంగా చర్చించారు. అమరావతి ప్రస్తుత దుస్థితికి నాడు అధికారంలో ఉన్న టీడీపీ, నేడు అధికారంలో ఉన్న వైసీపీ రెండూ బాధ్యులే అని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నామని అధికార వైసీపీ ప్రచారం చేస్తోందని, ఇది పూర్తిగా సత్యదూరమైన ప్రచారమని నేతలు తేల్చారు. ఇలాంటి అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, నాడు అధికారంలో ఉన్న పార్టీ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఈ కమిటీ పేర్కొంది.

బిజెపీ – జనసేన పార్టీలు కలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నాయి. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తరవాత కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు.

Latest Articles