ఆన్‌లైన్‌ లోన్‌లా, యువత మెడకు ఉరితాళ్లా..?.. ఈసారి ఏకంగా ప్రభుత్వ అధికారిణి బలి

డబ్బు అవసరం వచ్చింది కదా అని ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ని ఆశ్రయించారా..? మీరు చిక్కుల్లో పడ్డట్లే. వారు వేసే ఇంట్రస్ట్ రేటులకు మీ మైండ్ బ్లాంక్ అవుద్ది.

ఆన్‌లైన్‌ లోన్‌లా, యువత మెడకు ఉరితాళ్లా..?.. ఈసారి ఏకంగా ప్రభుత్వ అధికారిణి బలి
Follow us

|

Updated on: Dec 17, 2020 | 8:52 AM

డబ్బు అవసరం వచ్చింది కదా అని ఆన్‌లైన్ లోన్ యాప్స్‌ని ఆశ్రయించారా..? మీరు చిక్కుల్లో పడ్డట్లే. వారు వేసే ఇంట్రస్ట్ రేటులకు మీ మైండ్ బ్లాంక్ అవుద్ది. వాటిని తీర్చాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. కర్మ కాలి చెల్లింపుల విషయంలో కాస్త లేటు చేశారా..మిమ్మల్ని మానసికంగా హింసిస్తారు. ఆన్‌లైన్ లోన్లు తీసుకుంటున్నప్పుడే వారు మీ కాంటాక్టుల యాక్సెస్ తీసుకుంటారు. పేమెంట్ కాస్త లేటయితే..మీ సన్నిహితులకు ఫోన్ చేసి..మిమ్మల్ని ఓ డిఫాల్డర్ అని చెబుతారు. అంతేకాదు లీగల్ నోటీసుల కూడా సెండ్ చేస్తారు. ఈ ఒత్తిళ్ల కారణంగా యువత ఆత్మహత్యల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఇటువంటి ఘటనలు చాలా చూశాం. తాజాగా ఆన్‌లైన్‌ అప్పులకు మరో యువతి బలయ్యింది. అయితే ఆమె ఓ ప్రభుత్వ అధికారిణి అవ్వడం విస్మయం కలిగించే అంశం.

డెడ్‌లైన్‌లోగా డబ్బు చెల్లించలేదన్న కారణంగా అప్పిచ్చిన సంస్థ లోన్ తీసుకున్న యువతి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యవహరించడంతో ఓ ప్రభుత్వ అధికారిణి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన కిర్ని భూపాణి కుమార్తె మౌనిక (24).. ఖాత క్లస్టర్‌ పరిధిలో ఏఈవోగా రెండేళ్ల నుంచి వర్క్ చేస్తున్నారు. వీరు  కొన్నాళ్లుగా సిద్దిపేటలో నివాసం ఉంటున్నారు. తండ్రి వ్యాపార ప్రయత్నాల్లో నష్టాలు రావడంతో కుటుంబ అవసరాల కోసం మౌనిక ‘స్నాప్‌ఇట్‌ లోన్‌’ యాప్‌ నుంచి రెండు నెలల క్రితం రూ.3 లక్షల లోన్ తీసుకున్నారు. డెడ్‌లైన్‌లోగా దాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో యాప్‌ నిర్వాహకులు లో‌న్ డిఫాల్టర్ అంటూ ప్రకటిస్తూ ఆమె ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లన్నింటికీ వాట్సప్‌ మెసేజ్‌లు పంపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన మౌనిక ఈ నెల 14న ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె సోదరుడు భరత్‌ కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసినట్లు సిద్దిపేట పోలీసులు తెలిపారు.

Also Read :

ఏపీ ప్రజలకు అలెర్ట్ : ఆయుర్వేదం డబ్బాల్లో కొత్త రకం చాక్లెట్లు, అవి తిన్నారో ఇక అంతే !

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

Latest Articles
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. భారత మ్యాచ్‌లకు ఇకపై ఆ సమస్య లేదంట..
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
మాడు పగిలే ఎండలు..123 ఏళ్లలో 2వసారి అత్యధిక ఉష్ణోగ్రతలు.. మే లోనూ
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
సామ్‌సంగ్ ఫోన్‌పై ఊహకందని డిస్కౌంట్.. ఏకంగా రూ. 20 వేలు..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
భారీ విధ్వసం ముంగిట ప్రపంచం.. అణుయుద్ధం జరిగే 72 నిమిషాల్లో..
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
వీడిన ఎల్లయ్య మిస్సింగ్ మిస్టరీ..!
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
హీరోయిన్ లయ కూతురిని చూశారా ..? ఆ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
అందం ఈ ముద్దుగమ్మ చెంతకు చేరి దేవతగా తలచి వరం అడగడం..
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
గోవింద్ దేవ్ జీ ఆలయంలో రాధా రాణి పాదాలు ఎందుకు కనిపించవంటే
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
కోవిషీల్డ్ తీసుకున్న వారు సేఫ్‌..! : మాజీ శాస్త్రవేత్త రామన్‌
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..
ఎవరిని అడిగి తీసుకున్నారు.. రజినీ మూవీ టీంపై ఇళయరాజా సీరియస్..