చనిపోయాడనుకుని పోస్ట్ మార్టమ్‌కి తీసుకెళ్తే..

వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. చికిత్స పొందుతున్న రోగి చనిపోయాడనుకుని  రాత్రంతా పోస్ట్ మార్టమ్ గదిలో ఉంచారు వైద్యులు.   తీరా పోలీసులు వచ్చి చూసే సమయానికి  శ్వాస తీసుకుంటూ  కనిపించాడు.   సమాజాన్ని నివ్వెరపరిచే ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. కాశీరామ్ అనే 72 ఏళ్ల వృద్ధుడు  చికిత్స నిమిత్తం జూన్ 14న సాగర్ జిల్లా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.  అప్పటినుంచి వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. అయితే జూన్ 20 తేదీ […]

చనిపోయాడనుకుని పోస్ట్ మార్టమ్‌కి తీసుకెళ్తే..
Follow us

|

Updated on: Jun 22, 2019 | 3:12 PM

వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. చికిత్స పొందుతున్న రోగి చనిపోయాడనుకుని  రాత్రంతా పోస్ట్ మార్టమ్ గదిలో ఉంచారు వైద్యులు.   తీరా పోలీసులు వచ్చి చూసే సమయానికి  శ్వాస తీసుకుంటూ  కనిపించాడు.   సమాజాన్ని నివ్వెరపరిచే ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

కాశీరామ్ అనే 72 ఏళ్ల వృద్ధుడు  చికిత్స నిమిత్తం జూన్ 14న సాగర్ జిల్లా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.  అప్పటినుంచి వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నారు. అయితే జూన్ 20 తేదీ రాత్రి కాశీరామ్ మృతి చెందినట్టుగా  నిర్ధారించి పోస్ట్ మార్టమ్ చేసే గదికి తరలించారు.  విషయం తెలుసుకున్న పోలీసులు మరుసటిరోజు  అక్కడికి చేరుకుని  పరిశీలించే సమయంలో కాశీరామ్  శ్వాసతీసుకోవడం కనిపించింది. వారు వెంటనే వైద్యులను పిలవడంతో మళ్లీ చికిత్స ప్రారంభించారు. అయితే వృద్ధుడు కొద్ది సేపటికే ప్రాణాలు విడిచాడు.

కాశీరామ్ రాత్రంతా ప్రాణాలతోనే ఉన్నాడని,  కావాలనే డాక్టర్లు మార్చురీకి తరలించారని, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని  పోలీసులు సీరియస్ అయ్యారు. . మరోవైపు జిల్లా వైద్యాధికారి రోషన్ మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని అంగీకరించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Latest Articles