Man Bites Snake: నన్నే కాటేస్తావా..? పామును నోటితో కొరికి చంపి.. రక్తం తాగాడు.. ఇంకా చేశాడంటే..?

Odisha Man Bites Snake: పామును చూస్తేనే చాలా మంది భయపడి పారిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి తనను విష సర్పం కాటేసిందని పగ తీర్చుకున్నాడు. ఏకంగా ఆ పామును వెతికి పట్టుకుని

Man Bites Snake: నన్నే కాటేస్తావా..? పామును నోటితో కొరికి చంపి.. రక్తం తాగాడు.. ఇంకా చేశాడంటే..?
Snake

Updated on: Aug 13, 2021 | 12:56 PM

Odisha Man Bites Snake: పామును చూస్తేనే చాలా మంది భయపడి పారిపోతుంటారు. అలాంటిది ఓ వ్యక్తి తనను విష సర్పం కాటేసిందని పగ తీర్చుకున్నాడు. ఏకంగా ఆ పామును వెతికి పట్టుకుని నోటితో కొరికి చంపాడు. ఆ తర్వాత దాని రక్తం తాగి.. ఊరంతా తిరిగాడు. ఈ షాకింగ్ సంఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో బుధ‌వారం రాత్రి చోటు చేసుకుంది. జిల్లాలోని శాలిజంగా పంచాయతీ గంభారిప‌టియా గ్రామానికి చెందిన కిశోర్ భ‌దరా (45) అనే వ్యక్తి బుధ‌వారం రాత్రి త‌న పొలం నుంచి ఇంటికి తిరిగి వ‌స్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో అత‌ని కాలుకు విష‌ స‌ర్పం రక్తపింజర కాటేసింది. పాము కాటేసింద‌న్న విష‌యాన్ని గ్రహించిన కిశోర్.. ఆ ప్రాంతంలో టార్చ్ స‌హాయంతో వెతికాడు. అక్కడున్న పామును ప‌ట్టుకుని.. నోటితో కొరికి చంపాడు.

అనంతరం పాముతో ఊరంతా తిరిగాడు. అనంతంర దాన్ని త‌న భార్యకు, గ్రామస్థులకు చూపించి జ‌రిగిన విష‌యాన్ని చెప్పాడు. దీంతో వారు ఆందోళన చెంది ఆసుపత్రికి వెళ్లాలని కిశోర్ భద్రకు సూచించారు. కానీ ఆయన ఆసుపత్రికి వెళ్లకుండా పాముకాటుకు మందు ఇచ్చే నాటువైద్యుడి వద్దకు వెళ్లాడని గ్రామస్థులు తెలిపారు. నాటు వైద్యంతో తాను బాగానే ఉన్నాన‌ని, త‌నకెలాంటి స‌మ‌స్య లేద‌ని కిషోర్ బదారా పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని.. వెల్లడించాడు. కాగా.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:

Operation Langda: నేరస్థులే టార్గెట్‌గా ఆపరేషన్ లంగ్డా.. యోగి సర్కార్ యాక్షన్ ప్లాన్‌లో ఎన్ని ఎన్‌కౌంటర్లు జరిగాయో తెలిస్తే షాకే..

Delta Plus Variant: వ్యాక్సిన్ వేయించుకున్నా డెల్టా వేరియంట్ కాటేస్తోంది.. మహారాష్ట్రలో గంటల వ్యవధిలోనే ఇద్దరు మృతి..