Woman Dance: అర్థరాత్రి నడిరోడ్డుపై చిందులేసిన యువతి… కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘన కింద కేసు నమోదు

|

Apr 17, 2021 | 6:08 AM

Woman Dance: ఒక వైపు కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. వైరస్‌ను...

Woman Dance: అర్థరాత్రి నడిరోడ్డుపై చిందులేసిన యువతి... కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘన కింద కేసు నమోదు
Woman Dance
Follow us on

Woman Dance: ఒక వైపు కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో కర్ఫ్యూ విధిస్తున్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు అధికారులు పలు కఠినమైన ఆంక్షలు విధిస్తుంటే కొందరేమో నిర్లక్ష్యం చేస్తూ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువతి రాత్రి పూట కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘించి చిక్కుల్లో పడిపోయింది. చివరకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సోషల్‌ మీడియాలో తన ఫాలోవర్ల కోసం చేసిన ప్రయత్నం చిక్కుల్లో పడేలా చేసింది.

గుజరాత్‌లో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నారు. రాజ్‌కోటకు చెందిన యువతి ప్రిషా రాథోడ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ చేస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య భారీగా ఉంది. వారిని మరింతగా ఆకట్టుకునేందుకు రాత్రి సమయంలో కర్ఫ్యూ ఉన్నా.. అవేమి లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చి పాటలకు డ్యాన్స్‌లు చేసింది. అనంతరం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడినియో చూసిన కొందరు ఆమె కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆమె వివరాలు సేకరించిన పోలీసులు.. ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే అప్పటికే ఆ వీడియోను తాను డిలీట్‌ చేశానని, ఆ వీడియోను చాలా మంది షేర్‌ చేయడంతో బయటకు వచ్చిందని ఆ యువతి పోలీసులకు తెలిపింది. ఏది ఏమైనా కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించడంతో ఆమెపై రాజ్‌కోట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇకపై ఎవరూ కూడా ఇలాంటి పనులు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. రాత్రి సమయంలో కర్ఫ్యూ ఉన్నందున కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇవీ చదవండి: Viral Video: ఆటో డ్రైవర్‌గా మారిన బాక్సింగ్‌ ప్లేయర్‌.. క్రీడాకారుల దుస్థితికి ఇదే నిద‌ర్శన‌మంటోన్న నెటిజ‌న్లు..

Nirav Modi: బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీని భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం