Maharashtra: మనం 21వ శతాబ్దంలో జీవిస్తున్నాం.. మనిషి తన ఆధునికం యుగంలో విజ్ఞానంతో ఆకాశాన్ని అందుకున్నాడు. అయినప్పటికీ మూఢనమ్మకాలను విడలేకున్నాడు. ఇంకా చెప్పాలంటే మన మూఢ నమ్మకాల ఆధారంగా మహిళలపై జరుగుతున్నా నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మూఢనమ్మకాల పేరుతో 2016 నుంచి 2020 మధ్య 94 మందికి పైగా మహిళలు హత్యకు గురయ్యారని గణంకాలు చెబుతున్నాయి. కొంతమంది స్త్రీలను మంత్రగత్తెలని ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. గత 2 సంవత్సరాలలో పరిస్థితులు మారాయని మీరు అనుకుంటే, అందుకు భిన్నంగా నిరూపించడానికి తాజాగా ఓ దారుణ ఘటన జరిగింది. మంత్రగత్తె అనే అనుమానంతో ఓ మహిళను వివస్త్ర చేసి నగరంలో ఊరేగించిన వీడియో సోషల్ మీడియా (Social media) లో వైరల్ (Viral Video) గా మారింది. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
రాష్ట్రలోని నందుర్‌బార్ జిల్లాలో ఓ మహిళ మంత్రవిద్య చేస్తోందని స్థానికులు అనుమానించారు. దీంతో విచక్షణ మరచిన స్థానికులు ఆ మహిళను వివస్త్రను చేసి నడి వీధిలో ఊరేగించారు. ఈ ఘటనను కొందరు తమ కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను పరిగణనలోకి తీసుకున్న మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి (MANS) విచారణ జరపాల్సిందిగా నందుర్‌బార్‌లోని జిల్లా అధికార యంత్రాంగాన్ని అభ్యర్థించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర, కేంద్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అంధశ్రద్ధ నిర్మూలన్ సమితిప్రతినిధి తెలిపారు. ఈ ఆధునిక కాలంలో కూడా మూఢనమ్మకాలు ఏంటి అంటూ కొందరు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: Andhra Pradesh: గబ్బర్ సింగ్ రేంజ్‌లో.. పోలీస్ స్టేషన్‌కు గుర్రంపై వచ్చిన ఎస్ఐ.!
Shakuni Temple: మనదేశంలో శకునికి ఆలయం.. శకుని మంచివాడే అంటూ ఆదివాసులు పూజలు..పొంగల్, కల్లు నైవేద్యం