Sanjay Raut: పత్రాచల్‌ భూకుంభకోణంలో సంజయ్‌ రౌత్‌కు షాక్‌.. ఏ క్షణంలోనైనా అరెస్టు..!

|

Jul 31, 2022 | 4:37 PM

Sanjay Raut: పత్రాచల్‌ స్కామ్‌లో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసింది. దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ సంజయ్‌ను ఏ క్షణంలోనైనా..

Sanjay Raut: పత్రాచల్‌ భూకుంభకోణంలో సంజయ్‌ రౌత్‌కు షాక్‌.. ఏ క్షణంలోనైనా అరెస్టు..!
Sanjay Raut
Follow us on

Sanjay Raut: పత్రాచల్‌ స్కామ్‌లో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. దాదాపు 8 గంటల పాటు విచారించిన ఈడీ సంజయ్‌ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే విచారణకు సహకరించకపోవడంతో ఈడీ సంజయ్‌ని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంజయ్‌ రౌత్‌కు సమన్లు జారీ చేసింది. మహారాష్ట్రలోని ముంబై నగర శివారులోని భాండూప్‌లోని ఉన్న సంజయ్ నివాసానికి ఉదయం 7 గంటలకు ఈడీ అధికారులు చేరుకున్నారు.

ఇటీవల ఈడీ సమన్లు జారీ చేయగా, పార్లమెంట్‌ సమావేశాలు ఉన్నాయని సంజయ్‌ పట్టించుకోకపోవడంతో ఈడీ ఆయన నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 1034 కోట్ల రూపాయల పత్రాచల్‌ భూ కుంభకోణంలో ఈడీ అధికారులు గత సంవత్సరం జూన్‌ 28న సంజయ్‌కు మొదటి సారిగా సమన్ల జారీ చేసింది. ఇప్పటికే కొన్ని ఆస్తులను సైతం సీజ్‌ చేసింది ఈడీ. ఆయన ఇంట్లో పెద్ద ఎత్తున అధికారులు సోదాలు నిర్వహించడంతో శివసేన సైనికులు ఆయన ఇంటికి భారీగా తరలి వచ్చారు. మరోవైపు తాను ఎటువంటి స్కామ్‌ చేయలేదని సంజయ్‌ రౌత్‌ ట్వీట్లు చేస్తున్నారు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా శివసేన వీడే ప్రసక్తేలేదని సంజయ్‌ రౌత్‌ స్పష్టం చేస్తున్నారు. తాను చనిపోయినా సరే ఈడీకి లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి