3 Farm Laws: అసలు 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలేంటి..?.. పూర్తి వివరాలు మీ కోసం

|

Nov 19, 2021 | 10:29 AM

జూన్ 15, 2020న వ్యవసాయ చట్టంపై కేంద్రం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది.  2020 సెప్టెంబర్ 17న బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2020 సెప్టెంబర్ 20న బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది. 

3 Farm Laws: అసలు 3 వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలేంటి..?.. పూర్తి వివరాలు మీ కోసం
New Farm Laws Explanation
Follow us on

జూన్ 15, 2020న వ్యవసాయ చట్టంపై కేంద్రం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది.  2020 సెప్టెంబర్ 17న బిల్లులకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2020 సెప్టెంబర్ 20న బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది.  2020 సెప్టెంబర్‌ 27న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు.  2020 నవంబర్ 26న రైతుల నిరసనలు ప్రారంభమయ్యాయి. ఆందోళనల్లో 40కి పైగా రైతు సంఘాలు పాల్గొన్నాయి. డిసెంబర్ 8న భారత్ బంద్‌కు పిలుపునిచ్చి.. విజయవంతం చేశారు. డిసెంబర్ 20న అమరవీరుల స్మారక దినంగా పాటించారు రైతులు.  డిసెంబర్ 23న రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. జనవరి 26 మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది.. రెడ్‌ ఫోర్ట్ దగ్గర ట్రాక్టర్ల ర్యాలీ జరిగింది. అదికాస్తా ఉద్రిక్తతకు దారితీసింది. ఇంటర్నేషనల్ మీడియా పూర్తిగా ఇండియాపై ఫోకస్‌ పెట్టేలే చేసిన ఘటన ఇది. ఇక గతేడాది అక్టోబర్ 2020 నుంచి జనవరి 2021 వరకు 11 దఫాలుగా రైతులు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పటికీ.. సఫలీకృతం కాలేదు. అయితే జనవరి 2021న – నూతన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్.. మొత్తం 6 రాష్ట్రాల ప్రభుత్వాలు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. పంజాబ్, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్  రాష్ట్రాలు కౌంటర్ చట్టాలు ప్రవేశపెట్టాయి.

మొత్తంగా మూడు సాగు చట్టాలు చెబుతోంది ఏంటి.. కేంద్రం ఇన్నాళ్లూ ఈ బిల్లులపై ఏమని సమర్థించుకుందో ఓసారి చూద్దాం. .

BIll1 : ధరల హామీ-వ్యవసాయ సేవల బిల్లు(సాధికారత,రక్షణ) 2020-బిల్లు
>>రైతులు పండించబోయే పంటకు ముందుగానే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం
>>నిర్ణీత కాలానికి ప్రైవేట్ వ్యాపారి రైతుతో ఒప్పందం- పంటల కొనుగోలు
>>ఎవరికైనా రైతులు తమను పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు
>>వ్యవసాయ రంగంలో సాంకేతికతకు పెద్దపీట
>>ప్రైవేట్ వ్యాపారులతో కాంట్రాక్ట్ ద్వారా 5హెక్టార్ల లోపు భూమి ఉన్న చిన్న,సన్నకారు రైతులకు లబ్ది

Bill2: నిత్యావసర వస్తువుల(సవరణ) బిల్లు 2020 బిల్లు
>>ధాన్యం, నూనె గింజలు, ఉల్లిగడ్డలు, బంగాళాదుంపలు నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగింపు
>>ఇష్టానుసారం ధరలు పెంచి అమ్మే పెద్ద కంపెనీల గుత్తాధిపత్యానికి తెర
>>విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం
>>తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి సప్లై చైన్ ఆధునీకరించబడే అవకాశం
>>కోల్ట్ స్టోరేజీలు,వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పన

Bill 3: వ్యవసాయ ఉత్పత్తుల వర్తక, వాణిజ్యం (ప్రోత్సాహం, సదుపాయకల్పన) బిల్లు-2020
>>ఉత్పత్తుల అమ్మకాలు-కొనుగోళ్లకు రైతులు-ప్రైవేట్ వ్యాపారులకు స్వేచ్చ
>>రైతులు తమ ఇష్టానుసారం ఎవరికైనా పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు
>>మార్కెట్ యార్డులకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు
>>కనీస మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు
>>ధరల నియంత్రణ రైతులు-ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే
>>ప్రైవేట్ వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలు
>>మార్కెటింగ్/రవాణా ఖర్చులు,ఇబ్బందులు ఉండవు
>>అంతరాష్ట్ర వాణిజ్యం మరింత సులభతరం

 

Also Read: PM Modi: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని ప్రకటన