Tomato Fever: కేరళలో పిల్లలకు టమాటో జ్వరం.. దీని లక్షణాలు ఏమిటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

|

May 10, 2022 | 12:56 PM

Tomato Fever: ఒక వైపు కరోనా మహమ్మారితో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు కొత్త కొత్త వైరస్‌లు వెంటాడుతున్నాయి. ఇక కేరళ (Kerala)లోని కొల్లం నగరంల టమాటో జ్వరం కేసులు..

Tomato Fever: కేరళలో పిల్లలకు టమాటో జ్వరం.. దీని లక్షణాలు ఏమిటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
Follow us on

Tomato Fever: ఒక వైపు కరోనా మహమ్మారితో ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు కొత్త కొత్త వైరస్‌లు వెంటాడుతున్నాయి. ఇక కేరళ (Kerala)లోని కొల్లం నగరంల టమాటో జ్వరం కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 82 ఈ జ్వరం కేసులు నమోదైనట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలల టమాటో  జ్వరం కేసులు కనిపిస్తున్నాయి. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఇదే నిర్ధారణ అయింది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఇంతవరకు ఈ జ్వరానికి సంబంధించిన కారణాలు గుర్తించలేదు. కేసులను పర్యవేక్షిస్తున్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. కేరళలో కేసుల సంఖ్య పెరగడంతో రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేశారు. టొమాటో జ్వరానికి సంబంధించిన కేసుల నివారణకు ఇక్కడి గ్రామాల్లో అవగాహన ప్రచారం నిర్వహించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

 టమాటో జ్వరం అంటే ఏమిటి?

టమాటో ఫీవర్‌ని టొమాటో ఫ్లూ అని కూడా అంటారు. దీని లక్షణాలు 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో కనిపిస్తాయి. అయితే ఇది వైరల్ ఫీవరా లేక చికున్‌గున్యా లేదా డెంగ్యూ జ్వరమా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. పిల్లల చర్మంపై పొక్కులు ఎర్రగా, గుండ్రంగా ఉండడం వల్ల దీనికి టమాటో జ్వరం అని పేరు పెట్టారు. కొన్నిసార్లు వాటి పరిమాణం టమోటాతో సమానంగా మారుతుంది. కొల్లాం జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. అయితే ఇది రాష్ట్రంలోని అనేక జిల్లాలకు వ్యాపించవచ్చని ఆరోగ్య అధికారులు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

ఎలాంటి లక్షణాలు ఉంటాయి..

ఈ జ్వరం ప్రభావం పిల్లల చర్మంపై కనిపిస్తుంది. చర్మంపై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు, దురద, నోరు పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. జబ్బుపడిన పిల్లల శరీరంపై టమోటో పరిమాణంలో పొక్కులు లేదా దద్దుర్లు కూడా సంభవించవచ్చు. అధిక జ్వరంతో పాటు శరీర నొప్పులు, కీళ్ల వాపులు, అలసట కూడా టొమాటో జ్వరం లక్షణాలు. ఇది కాకుండా, చేతులు, మోకాళ్లపై ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలో నీరు తగ్గిపోయే అవకాశం ఉంది. అందువల్ల, దాని లక్షణాలను గమనించడం చాలా ముఖ్యం.

పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే నేరుగా వైద్యుడిని సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. సోకిన పిల్లలలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. ఎక్కువసార్లు నీళ్లు తాగించాలి. స్నానం చేయిస్తే గోరువెచ్చని నీటిని మాత్రమే వాడండి. శరీరంపై దద్దుర్లు లేదా పూతల గీతలు వేయవద్దు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి