Russia Ukraine War: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు.. సరుకులు, మెడిసిన్స్ పంపిన భారత్..

|

Mar 02, 2022 | 11:39 AM

"ఆపరేషన్‌ గంగ"లో భాగంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలను రంగంలోకి దింపింది కేంద్ర ప్రభుత్వం. C-17 ఫ్లైట్స్‌ను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపిస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌ను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు..

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న రష్యా దాడులు.. సరుకులు, మెడిసిన్స్ పంపిన భారత్..
Indian Air Force's C-17 transport aircraft carrying relief material
Follow us on

Russia Ukraine War News: రష్యా ఎటాక్స్‌తో ఉక్కిరిబిక్కిరవుతోంది ఉక్రెయిన్‌ . త్రివిధ దళాలతో ముప్పేట దాడి చేస్తోంది రష్యా. నలువైపులా చుట్టుముట్టి బాంబుల వర్షం కురిపిస్తోంది. మిస్సైల్స్‌, ఫిరంగులతో పెను విధ్వంసం సృష్టిస్తోంది రష్యా. కీవ్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి రష్యన్ బలగాలు. 64 కిలోమీటర్ల పొడవైన యుద్ధ ట్యాంకులతో కీవ్‌ను చుట్టుమట్టింది రష్యా. మరోవైపు ఒడెషా వైపు అణు జలాంతర్గాములను మోహరించి, నెక్ట్స్‌ లెవల్‌ వార్‌పై సంకేతాలు పంపింది రష్యా. ఒకపక్క ఫ్లైట్స్‌ లేవ్‌, మరోపక్క రైళ్లన్నీ ఫుల్‌, ఇంకోపక్క సరిహద్దుల్లో ఆంక్షలు. మరి, ఇండియన్స్‌ బోర్డర్‌ దాటేదెలా? బయటపడేదెలా? ఇప్పటివరకు ఎంతమందిని కేంద్రం సేఫ్‌గా తీసుకొచ్చింది? ఇంకెంతమంది ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయారు?

ఉక్రెయిన్‌లో మరో 20వేల మంది భారతీయులు ఉన్నారన్నది భారత విదేశాంగ అంచనా. అయితే, ఈ 20వేల మందిలో 60 శాతం వచ్చేశారని చెబుతోంది. అంటే, 12వేల మంది ఉక్రెయిన్‌ను వీడారని అంటోంది. ఇక, మిగిలింది కేవలం 8వేల మందేనని, వాళ్లందరినీ సేఫ్‌గా తరలిస్తామంటోంది కేంద్రం. మరి, నిజంగానే 60శాతం మంది భారతీయులు.

“ఆపరేషన్‌ గంగ”లో భాగంగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానాలను రంగంలోకి దింపింది కేంద్ర ప్రభుత్వం. C-17 ఫ్లైట్స్‌ను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపిస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఇండియన్స్‌ను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కేంద్రం. స్టూడెంట్స్‌తో సంప్రదింపులు జరుపుతూ ఉక్రెయిన్‌ బోర్డర్‌కు విమానాలను పంపుతోంది.

రష్యా గత వారం పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించిన తర్వాత యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు భారతదేశం మానవతా సహాయం, వైద్య సామాగ్రిని పంపుతోంది. అధికారుల ప్రకారం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందం 100 టెంట్లు, 2,500 దుప్పట్లను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ , హిండన్ ఎయిర్‌బేస్‌కు పంపుతోంది. అక్కడి నుంచి విమానంలో ఉక్రెయిన్ పొరుగు దేశమైన రొమేనియాకు పంపనున్నారు. ఈ విమానం ఉదయం 10.15 గంటలకు బయలుదేరింది.

సహాయక సామగ్రిని తీసుకుని మరిన్ని విమానాలు బయలు దేరుతున్నాయి. ఇందులో మరో రెండు విమానాలు ఇవాళ  ఢిల్లీ నుంచి పోలాండ్‌కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి. నిన్న రాత్రి నుంచే సరుకుల లోడింగ్ పూర్తయింది.

IAF plane at Hindon carrying humanitarian assistance

Humanitarian assistance to Ukraine

పోలాండ్ మీదుగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం మంగళవారం ఔషధాలు , ఇతర సహాయక సామగ్రిని మొదటి సరుకును పంపింది కేంద్ర ప్రభుత్వం. మందులే కాకుండా ఆహార పదార్థాలు కూడా పంపించారు. వైమానిక దళం C-17 విమానం పంపిన వస్తువులలో నమ్కీన్ మూంగ్ దాల్, బంగాళాదుంప భుజియా కూడా ఉంది. ANI విడుదల చేసిన ఫుటేజ్ ప్రకారం..

ఉక్రెయిన్ ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ పెద్ద మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మంగళవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ.. కనీసం 14 మంది పిల్లలతో సహా 300 మంది పౌరులు మరణించారని వెల్లడించారు.

Ndrf India

India Ndrf

రష్యా దాడి కారణంగా ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో భారత ప్రభుత్వం భారతీయ పౌరులను రొమేనియా సరిహద్దుకు తీసుకువెళుతోంది. అక్కడి నుంచి ఖాళీ చేయబడిన భారతీయులను సరిహద్దు నుంచి తొమ్మిది గంటల ప్రయాణంలో ఉన్న రాజధాని బుకారెస్ట్‌కు తీసుకువెళతారు. ఖాళీ చేయబడిన భారతీయులు ఎయిర్ ఇండియా విమానంలో భారతదేశానికి బయలుతారు.

ఇవి కూడా చదవండి: Viral Video: ఇదేందయ్య ఎప్పుడూ చూడలే..! పిల్లికి ‘డీ’ కెటగిరీ సెక్యూరిటీ.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Summer Health Tips: వేసవిలో ఆ నీరే అమృతం.. కుండ నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

Hair Care Tips: డ్రై హెయిర్‌తో ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీ కోసమే..