India-China border: అదుపులోకి పరిస్థితులు..లడఖ్‌లో భారత్, చైనా యుద్ద ట్యాంకుల ఉపసంహరణ.. వీడియో

| Edited By: Team Veegam

Feb 11, 2021 | 7:05 PM

Indian Army Video: కొన్నాళ్లుగా భారత్ , చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అదుపులోకి వస్తున్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి...

India-China border: అదుపులోకి పరిస్థితులు..లడఖ్‌లో భారత్, చైనా యుద్ద ట్యాంకుల ఉపసంహరణ.. వీడియో
Follow us on

Ladakh:  కొన్నాళ్లుగా భారత్ , చైనా దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అదుపులోకి వస్తున్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న ఇరు దేశాల బలగాలను ఉపసంహరించుకున్నట్టు చైనా అనౌన్స్ చేసింది. ఈ మేరకు తూర్పు లద్దాక్ లో ఉన్న పాంగాంగ్ సరస్సు వద్ద భారత్, చైనా బలగాలే వెనక్కి వెళ్లినట్టు చైనా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి భారత్‌ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది.

తాజాగా  భారత రక్షణ వర్గాలు విడుదల చేసిన వీడియోలో భారతీయ, చైనా సైనిక ట్యాంకులు వెనక్కి కదులుతున్నట్లు కనిపించింది.  లడఖ్‌లోని పంగాంగ్ త్సో వద్ద ఇరుపక్షాలు తొలుత బలగాల ఉపసంహరణపై ఒక ఒప్పందం కుదుర్చుకున్నాయి. పశ్చిమ హిమాలయాలలో తీవ్రంగా పోటీ పడుతున్న సరస్సు ప్రాంతం నుండి దళాలను వెనక్కి తీసుకురావడానికి భారత్, చైనా అంగీకరించినట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం చెప్పారు.  సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలా చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా భారత ఆర్మీపై ఆయన ప్రశంసలు కురిపించారు. మన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారని ప్రశంసించారు. చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

కాగా  గతేడాది మే లో గల్వాన్ లోయ వద్ద చైనా బలగాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు పరిస్థితులు తలెత్తాయి. కొన్నిసార్లు ఇరు దేశాల ఆర్మీ మధ్య పోట్లాట కూడా జరిగిన విషయం తెలిసిందే.

Also Read:

కెంట్ వేరియంట్‌తో ప్రపంచానికి ముప్పు, బ్రిటన్ శాస్త్రవేత్త హెచ్ఛరిక, సాధారణ వ్యాక్సిన్లకు లొంగదట

Sister Andre: కరోనాను ఓడించిన 116 ఏళ్ల బామ్మ.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వృద్ధురాలు..